AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun- Neeraj Chopra: ‘నిన్ను చూసి దేశమంతా గర్విస్తోంది’.. బల్లెం వీరుడికి బన్నీ స్పెషల్‌ విషెస్‌

భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో 88.17 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరిన నీరజ్‌ చోప్రా బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్‌ నదీమ్‌ (87.82 మీటర్లు) గట్టి పోటీ ఇచ్చినా రజతంతో సరిపెట్టుకున్నాడు. కాగా నీరజ్‌ చోప్రా విజయంతో అంతర్జాతీయ క్రీడా వేదికపై మువ్వన్నెల జెండా మరోసారి రెపరెపలాడింది. బల్లెం వీరుడి విజయం అద్భుతమంటూ ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Allu Arjun- Neeraj Chopra: 'నిన్ను చూసి దేశమంతా గర్విస్తోంది'.. బల్లెం వీరుడికి బన్నీ స్పెషల్‌ విషెస్‌
Neeraj Chopra, Allu Arjun
Basha Shek
|

Updated on: Aug 28, 2023 | 3:32 PM

Share

బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా మళ్లీ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ షిప్‌లో స్వర్ణపతకం గెల్చుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో 88.17 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరిన నీరజ్‌ చోప్రా బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్‌ నదీమ్‌ (87.82 మీటర్లు) గట్టి పోటీ ఇచ్చినా రజతంతో సరిపెట్టుకున్నాడు. కాగా నీరజ్‌ చోప్రా విజయంతో అంతర్జాతీయ క్రీడా వేదికపై మువ్వన్నెల జెండా మరోసారి రెపరెపలాడింది. బల్లెం వీరుడి విజయం అద్భుతమంటూ ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈక్రమంలో ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికైన అల్లు అర్జున్‌  సోషల్‌ మీడియా వేదికగా నీరజ్‌ చోప్రాకు అభినందనలు తెలిపాడు.

గతంలో నీరజ్‌ చోప్రాను కలిసిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన అల్లు అర్జున్‌.. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌లో మొదటిసారి భారత్‌కు స్వర్ణం అందించిన నీరజ్ చోప్రాకు అభినందనలు. నీ విజయాన్ని చూసి దేశమంతా గర్వంతో పొంగిపోతోంది’ అని విషెస్‌ తెలిపాడు. కాగా కొన్ని నెలల క్రితం ఢిల్లీ వేదికగా జరిగిన ‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుల వేడుకలో అల్లు అర్జున్‌, నీరజ్‌ చోప్రా కలుసుకున్నారు. ఈ సందర్భంగా బన్నీతో కలిసి పుష్ప సినిమాలోని ‘తగ్గేదేలే’ అంటూ మేనరిజమ్‌ను అనుకరించి ఆకట్టుకున్నాడు నీరజ్‌. దీనికి సంబంధించి ఫొటోలు అప్పట్లో సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యాయి. కాగా అల్లు అర్జున్‌ త్వరలోనే పుష్ప 2.. ది రూల్‌ సినిమాతో మన ముందుకు రానున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ షరవేగంగ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ ట్వీట్

తగ్గేదేలే అంటూ పుష్పరాజ్, నీరజ్ చోప్రా.. వీడియో

అల్లు అర్జున్ విషెస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సరిగ్గా నేటికి 46 ఏళ్లు..పాక్ కు చుక్కలు చూపించిన భారత దిగ్గజాలు
సరిగ్గా నేటికి 46 ఏళ్లు..పాక్ కు చుక్కలు చూపించిన భారత దిగ్గజాలు
'ఇకపై బడి పిల్లలు షూ బదులు చెప్పులు ధరించాలి'.. ప్రభుత్వం ప్రకటన
'ఇకపై బడి పిల్లలు షూ బదులు చెప్పులు ధరించాలి'.. ప్రభుత్వం ప్రకటన
ముంబైలో కాలి బూడిదైన జగిత్యాల బస్సు!
ముంబైలో కాలి బూడిదైన జగిత్యాల బస్సు!
దారులన్నీ మేడారం వైపే.. అలా చేస్తే ఇట్టే పసిగడతారు..
దారులన్నీ మేడారం వైపే.. అలా చేస్తే ఇట్టే పసిగడతారు..
హార్దిక్ మెసేజ్‎కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కళ్లలో ఆనంద బాష్పాలు
హార్దిక్ మెసేజ్‎కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కళ్లలో ఆనంద బాష్పాలు
ఆదివారం సెలవు రద్దు.. ఆ రోజు తెరిచే ఉంటుంది? కీలక నిర్ణయం..!
ఆదివారం సెలవు రద్దు.. ఆ రోజు తెరిచే ఉంటుంది? కీలక నిర్ణయం..!
ఖర్చు లేని మ్యాజిక్.. బియ్యం నీటితో ఇన్ని ప్రయోజనాలా...?
ఖర్చు లేని మ్యాజిక్.. బియ్యం నీటితో ఇన్ని ప్రయోజనాలా...?
అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు ఊహించని స్పందన
అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు ఊహించని స్పందన
నువ్వేకావాలి ఫస్ట్ మహేష్‌తో తీద్దామనుకున్నాం.. కానీ అసలు జరిగింది
నువ్వేకావాలి ఫస్ట్ మహేష్‌తో తీద్దామనుకున్నాం.. కానీ అసలు జరిగింది
నాపై ఆ ముద్ర వేశారు.. డైరెక్టర్ వేణు యెల్దండి..
నాపై ఆ ముద్ర వేశారు.. డైరెక్టర్ వేణు యెల్దండి..