Varalakshmi Vratham: వరలక్ష్మి వ్రతం వేడుకల్లో ‘కాంతారా’ హీరో.. భార్య, పిల్లలతో కలిసి ప్రత్యేక పూజలు.. ఫొటోస్
కాంతారా హీరో రిషబ్ శెట్టి ఇంట్లో వరమహాలక్ష్మి పండగను అత్యంత ఘనంగా జరుపుకొన్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి అతని సతీమణి ప్రగతి శెట్టి, పిల్లలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అభిమానులను, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.