- Telugu News Photo Gallery Cinema photos Janhvi Kapoor Interesting Comments about JrNTR's Devara movie telugu cinema news
Janhvi Kapoor: దేవర సినిమాతో సొంతింటికి వచ్చినట్లుగా అనిపిస్తోంది.. జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ధడక్ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ..విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న దేవర చిత్రంలో జాన్వీ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
Updated on: Aug 28, 2023 | 1:08 PM

దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ధడక్ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ..విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న దేవర చిత్రంలో జాన్వీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మాస్ యాక్షన్ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇందులో జాన్వీ గ్రామీణ మత్య్సకారుల కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించనుంది.

ఇప్పటికే విడుదలైన జాన్వీ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. అందులో లంగావోణిలో సముద్రపు ఒడ్డున కుర్చొని కనిపించింది జాన్వీ. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో పాల్గోంటుంది జాన్వీ. ఇక తాజాగా మరో షెడ్యూల్లో ఆమెపై యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తెలుగు చిత్రపరిశ్రమపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇప్పటివరకు దేవర సినిమా చిత్రీకరణలో కేవలం మూడు రోజులే పాల్గొన్నానని.. మొదట్లో అందరూ హృదయపూర్వకంగా స్వాగతం పలికారని తెలిపింది.

ప్రతి ఒక్కరూ ప్రేమగా ఉండడంతో.. కెమెరా ముందు ఎంతో స్వేచ్ఛగా నటించానని.. అందరితో హాయిగా గడిపానని అన్నారు. వాళ్ల ప్రేమ చూస్తుంటే సొంతింటికి వచ్చినట్లుగానే అనిపిస్తుందని చెప్పుకొచ్చింది. సోమవారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.





























