- Telugu News Photo Gallery Cinema photos Magadheera to Pushpa awards winners in 69th national awards in Tollywood Telugu Entertainment Photos
Tollywood: టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్స్ జక్కన్న చెక్కిన వాళ్లే.. మగధీర నుంచి ఆర్ఆర్ఆర్ వరకు..
అప్పటిదాకా ఉన్న ట్రాక్‌ని ఉన్నట్టుండి కొత్త ఒరవడిలో నడిపించిన వారిని ట్రెండ్ సెట్టర్ అంటారు. అలా నేషనల్ అవార్డుల విషయంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది మగధీర. అప్పటిదాకా జాతీయ అవార్డులు వచ్చిన ప్రతిసారీ ఉత్తమ ప్రాంతీయ సినిమాగా ఏ సినిమా సెలక్ట్ అయిందన్నదే మన వాళ్లకు క్యూరియాసిటీ కలిగించిన విషయం. కానీ మగధీర ఆ థాట్‌ప్రాసెస్‌ని మార్చేసింది.జస్ట్ ప్రాంతీయ సినిమాగానే కాదు, షేర్‌ఖాన్... సాంకేతికంగానూ మనవాళ్లు తోపులు.
Updated on: Aug 28, 2023 | 1:08 PM

అప్పటిదాకా ఉన్న ట్రాక్‌ని ఉన్నట్టుండి కొత్త ఒరవడిలో నడిపించిన వారిని ట్రెండ్ సెట్టర్ అంటారు. అలా నేషనల్ అవార్డుల విషయంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది మగధీర. అప్పటిదాకా జాతీయ అవార్డులు వచ్చిన ప్రతిసారీ ఉత్తమ ప్రాంతీయ సినిమాగా ఏ సినిమా సెలక్ట్ అయిందన్నదే మన వాళ్లకు క్యూరియాసిటీ కలిగించిన విషయం. కానీ మగధీర ఆ థాట్‌ప్రాసెస్‌ని మార్చేసింది.

జస్ట్ ప్రాంతీయ సినిమాగానే కాదు, షేర్‌ఖాన్... సాంకేతికంగానూ మనవాళ్లు తోపులు. మన టెక్నీషియన్లకు నేషనల్ అవార్డులు వచ్చితీరాల్సిందేనని గట్టిగా సౌండ్ చేసింది మగధీర. అప్పటిదాకా ప్రాంతీయ సినిమాల కోసం చూసిన ఎదురుచూపులకు స్వస్తి చెప్పింది. సరికొత్తగా ఆలోచించేలా ఉసిగొల్పింది. రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర సినిమాకు బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డులు దక్కాయి.

ఆ ఒరవడిని బాహుబలితోనూ కంటిన్యూ చేశారు జక్కన్న. ఉత్తమ సినిమా, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీల్లో ఫస్ట్ పార్టు అవార్డు తెస్తే, రెండో భాగానికి మూడు అవార్డులు వరించాయి. ఘాజీ సినిమాకు కూడా అదే ఏడాది అవార్డు వరించింది.

ఆ తర్వాత పెళ్లిచూపులు , శతమానం భవతి సినిమాలు కూడా జాతీయ పురస్కారాలతో పండగ చేసుకున్నాయి. మన సినిమాల కాన్సెప్టులతో పాటు మన మాటలను కూడా గౌరవించడం మొదలుపెట్టింది నేషనల్ అవార్డు జ్యూరీ.

ఉత్తమ సినిమా, ఉత్తమ నటి, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగాల్లో అవార్డులు గెలుచుకొచ్చింది మహానటి సినిమా. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆ మూడూ విభాగాలు చాలా స్పెషల్. వాటిని జాతీయ పురస్కారాల జ్యూరీ గుర్తించినందుకు పండగ చేసుకున్నారు తెలుగు జనాలు.

ఆ తర్వాత సంవత్సరాలలోనూ, వివిధ రంగాల్లో తెలుగు వారి ప్రతిభను గుర్తించారు జ్యూరీ సభ్యులు. జెర్సీ మూవీకి, కలర్ ఫొటో సినిమాకు అవార్డులు పండినప్పుడు సేమ్ టు సేమ్ అలాంటి ఫీలింగ్‌నే టేస్ట్ చేశారు ఆడియన్స్. లేటెస్ట్ గా 69వ జాతీయ పురస్కారాల గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఓ తెలుగు హీరోకి నేషనల్ అవార్డు రావడం ఈ సారి ప్రత్యేకత. ఆ గుర్తింపు పొందిన హీరోగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఐకాన్ స్టార్.

అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు కొండపొలం గీత రచయిత చంద్రబోస్ ఆనందానికి అవధుల్లేవు. అటు ఉప్పెన యూనిట్ అయితే సంబరాలు చేసుకుంటోంది. అరడజను అవార్డులు తెచ్చుకున్న ట్రిపుల్ ఆర్ టీమ్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు.




