AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. ఆ స్టేషన్‌లో ఎయిర్‌ పోర్ట్‌ తరహా నిబంధనలు.. అవి ఉంటేనే ఎంట్రీ!

Secunderabad Station Redevelopment: సరికొత్త హంగులను రూపుదిద్దుకుంటున్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు కొత్త అనుభవంతో పాటు కొత్త రూల్స్‌ను కూడా పరిచయం చేయబోతుంది. అవును ఇకపై సికింద్రాబాద్ స్టేషన్‌లోనూ మెట్రో స్టేషన్ తరహా ఎంట్రీ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. అందే కాదు ఎయిర్‌పోర్ట్ తరహాలో సెక్యూరిటీ చెకింగ్ విధానం కూడా తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది.

ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. ఆ స్టేషన్‌లో ఎయిర్‌ పోర్ట్‌ తరహా నిబంధనలు.. అవి ఉంటేనే ఎంట్రీ!
Secunderabad Station Redevelopment
Anand T
|

Updated on: Mar 07, 2026 | 12:26 PM

Share

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్‌భారత్ ప్రాజెక్ట్‌లో భాగంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చుకుంటోంది. అప్‌డేట్‌ అయి అందుబాటులోకి వచ్చే ఈ స్టేషన్‌లో రూల్స్ కూడా మారబోతున్నాయి. మెట్రో, ఎయిర్‌పోర్ట్ తరహా సెక్యూరిటీ చెకింగ్ విధాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రాత్రి అయితే చాలూ స్టేషన్ పరిసరాల్లో తిరిగే చాలా మంది నిరాశ్రయులు నేరుగా స్టేషన్‌లోకి వచ్చి అక్కడే బెంచీలపై నిద్రపోతున్నారు. దీని వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి అడ్డుకట్టు వేసేందుకే మెట్రో స్టేషన్ తరహా టికెట్ చెకింగ్ విధాన్ని తీసుకురానున్నారు అధికారులు. ఇలా చేస్తే కేవలం టికెట్ ఉన్న వారు మాత్రమే స్టేషన్‌లోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది.

వచ్చే నెలలో అందుబాటులోకి

అయితే మృత్‌భారత్ ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త రూపులుదిద్దుకుంటున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. ఇప్పటి స్టేషన్‌ పునరాభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయి. దాదాపు 90 శాతం పనులు మొత్తం పూర్తయ్యాయి. ఎయిర్‌ కాంకోర్స్‌, ఇతర కొన్ని కీలకమైన పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవి కూడా త్వరలోనే పూర్తి చేసి స్టేషన్‌ పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.

రెండు వైపుల ఆరేసి చెకింగ్ పాయింట్స్

అయితే ఇప్పటికే పదో నంబరు ప్లాట్‌ఫామ్‌ సైడ్ ఉన్న పునరాభివృద్ధి పనులు దాదాపు పూర్తి అవడంతో రాబోయే నెలలో దీన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే సెక్యూరిటీ సిస్టమ్‌ను మాత్రం పూర్తి రైల్వే స్టేషన్ పనులు ముగిసిన తర్వాతే అమల్లోకి తేనున్నారు. అయితే సికింద్రాబాద్ పెద్ద స్టేషన్ కావడంతో రోజుకు లక్షల్లో ప్రయాణికులు స్టేషన్‌కు వస్తుంటారు. వీరికి ప్రస్తుతం ఉన్న రెండు సెక్యూరిటీ చెకింగ్ సెంటర్ సరిపోవు కావబట్టి ఇకపై ఒకటో నంబరు ప్లాట్‌ఫామ్, పదో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ ఉండే రెండు ప్రవేశ మార్గాల్లో దాదాపు ఆరు వరకు సెక్యూరిటీ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us