AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణమ్మ ఒడ్డున అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం.. 108 మంది వేద పండితులతో వరుణ యాగం!

తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసిన కృష్ణమ్మ ఒడ్డున నాగార్జునసాగర్ వేదికగా వరుణ యాగానికి శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పించిన ఈ యాగంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు..

కృష్ణమ్మ ఒడ్డున అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం.. 108 మంది వేద పండితులతో వరుణ యాగం!
Varuna Yagam In Telangana
M Revan Reddy
| Edited By: |

Updated on: Aug 07, 2026 | 6:17 PM

Share

నల్గొండ, ఆగస్ట్ 7: ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికైన నాగార్జునసాగర్.. ఇప్పుడు మరో అరుదైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని… సాగర్‌తో పాటు అన్ని జలాశయాలు నిండాలని.. రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పిస్తూ నిర్వహిస్తున్న ఈ యాగంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సాగు, తాగు నీరు లేక జనం అల్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రకృతి కరుణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది.

తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసిన కృష్ణమ్మ ఒడ్డున నాగార్జునసాగర్ వేదికగా వరుణ యాగానికి శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పించిన ఈ యాగంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆగస్టు 10న విజయవిహార్ ప్రాంగణంలో వరుణ యాగం జరగనుంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది వేద పండితులు, 11 హోమ గుండాల మధ్య శాస్త్రోక్తంగా యాగం నిర్వహించనున్నారు. ఈ యాగంలో అత్యంత కీలక ఘట్టమైన సకల పూర్ణాహుతి మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వరుణ యాగం కోసం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, దేవాదాయశాఖ అధికారులు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అర్చకులు స్థల పరిశీలన చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ యాగం వెనుక ఉన్న లక్ష్యం కేవలం సంప్రదాయం కాదు.. రాష్ట్ర సంక్షేమం. ఎల్‌నినో ప్రభావం తెలంగాణపై పడకుండా ఉండాలని.. కృష్ణా, గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని.. సాగర్‌తో పాటు అన్ని ప్రాజెక్టులు, చెరువులు నిండాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. రైతు పంట పండితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే సందేశంతో ఈ యాగాన్ని రేవంత సర్కార్ నిర్వహించనుంది.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల