ఆముదంతో మెరిసే చర్మం, ఒత్తైన కురులు.. ఈ సీక్రెట్ టిప్స్ తెలుసుకోండి!

07-08-2026

Pic credit - Instagram

Phani Ch

పురాతన కాలం నుండి మన ఇళ్లలో వాడుతున్న ఆముదం అందాన్ని రెట్టింపు చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందాన్ని పెంచడంలో ఆముదం ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం!

 కొద్దిగా ఆముదాన్ని అరచేతిలోకి తీసుకుని శరీరంపై రాసుకుంటే అది చర్మంపై ఒక రక్షణ పొరను ఏర్పాటు చేస్తుంది. ఇది చర్మంలోని తేమను బయటకు పోకుండా కాపాడి, సహజ మాయిశ్చరైజర్‌లా చర్మాన్ని ఎంతో మృదువుగా మారుస్తుంది.

శరీరంపై చిన్న చిన్న గాయాలు లేదా గీతలు పడినప్పుడు ఆ ప్రదేశంలో ఆముదం రాయడం వల్ల టిష్యూ త్వరగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల గాయాలు మానడం వేగవంతమవుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.

ఎండ వల్ల పొడిబారి, నిర్జీవంగా తయారైన కురులకు ఆముదం పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. వారంలోనే వెంట్రుకల చివర్లు చిట్లడం తగ్గి, జుట్టు ఎంతో నల్లగా, నిగనిగలాడుతూ మృదువుగా మారుతుంది.

ఒక చిన్న గిన్నెలో కొద్దిగా ఆముదం తీసుకుని గోరువెచ్చగా వేడి చేసి మాడుకు పట్టించాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారి, వెంట్రుకలు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతాయి.

పలుచటి కనుబొమలు ఉన్నవారు రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఆముదాన్ని కనుబొమలపై రాస్తే అవి నల్లగా, ఒత్తుగా పెరుగుతాయి. అంతేకాకుండా అక్కడ చర్మానికి తగినంత తేమ అంది చుండ్రు సమస్య రాకుండా ఉంటుంది.

ఒక టీస్పూన్ ఆముదంలో ఒక టీస్పూన్ జోజోబా ఆయిల్ లేదా కొబ్బరి నూనె కలిపి పగిలిన పెదవులపై రాయాలి. ఇది పెదవుల పొడిబారడాన్ని తగ్గించి, రక్తప్రసరణను పెంచి పెదవులకు మంచి ఛాయను ఇస్తుంది.