- Telugu News Photo Gallery Cinema photos Writer Vijayendra prasad Give update on mahesh babu rajamouli film in SSMB29 Telugu Entertainment Photos
SSMB29: రాజమౌళి – మహేష్ బాబు మూవీపై అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్..
ఇండస్ట్రీలో లీక్స్ అనే వర్డ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఆ మధ్య చిరు లీక్స్, ఆ తర్వాత చిరుని చూసి మిగిలిన వాళ్ల లీక్స్. కానీ, ఆ లీక్స్ కన్నా ముందు నుంచే ప్రచారంలో ఉంది స్టార్ రైటర్ లీక్స్. అయితే అప్పట్లో ఆయన లీక్స్ కి పర్టిక్యులర్‌గా ఓ కాయినింగ్ అంటూ ఏమీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం విజయేంద్ర లీక్స్ అనే పేరు స్థిరపడిపోయింది. రాజమౌళి కాంపౌండ్‌లో ఏం జరుగుతుందో చెప్పేదెవరు?
Updated on: Aug 28, 2023 | 1:09 PM

ఇండస్ట్రీలో లీక్స్ అనే వర్డ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఆ మధ్య చిరు లీక్స్, ఆ తర్వాత చిరుని చూసి మిగిలిన వాళ్ల లీక్స్. కానీ, ఆ లీక్స్ కన్నా ముందు నుంచే ప్రచారంలో ఉంది స్టార్ రైటర్ లీక్స్. అయితే అప్పట్లో ఆయన లీక్స్ కి పర్టిక్యులర్‌గా ఓ కాయినింగ్ అంటూ ఏమీ లేదు.

కానీ ఇప్పుడు మాత్రం విజయేంద్ర లీక్స్ అనే పేరు స్థిరపడిపోయింది. రాజమౌళి కాంపౌండ్‌లో ఏం జరుగుతుందో చెప్పేదెవరు? రాజమౌళి మాట్లాడరు. ఆయనతో సినిమాలు చేసే హీరోలు అసలు అందుబాటులో ఉండరు. అలాంటప్పుడు అభిమానగణానికి అప్‌డేట్స్ ఇచ్చేవారెవరు? ఇంకెవరు? నన్ అదర్ దేన్ స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్

ఆర్ ఆర్ ఆర్ అనే అక్షరాల గురించి ఎవరూ నోరు విప్పని సమయంలో, మీరు ఏం ఊహించుకుంటారో ఊహించుకోండి. అన్నీ సినిమాలో ఉంటాయని డేరింగ్‌గా చెప్పేశారు రాజమౌళి ఫాదర్. ఇప్పుడు మహేష్ సినిమా విషయంలో ముందు నుంచీ లీక్స్ ఇస్తున్నది కూడా విజయేంద్రప్రసాదే. గుంటూరుకారం తర్వాత వెంటనే రాజమౌళి సెట్స్ కి వెళ్తారు మహేష్

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ అప్‌డేట్స్ కోసం ఘట్టమనేని అభిమానులు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తూనే ఉన్నారు. అలాంటివారిని దృష్టిలో పెట్టుకునే విజయేంద్రప్రసాద్ ఏదో ఒక విషయాన్ని లీక్ చేస్తుంటారు.

ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వంచరస్ మూవీ అని, హాలీవుడ్ స్టార్లు ఉంటారని హింట్ ఇచ్చేశారు విజయేంద్రప్రసాద్. దీంతో మహేష్ సినిమాను ఇంకో రేంజ్‌లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ రీసెంట్‌గా మహేష్ వర్కవుట్ ఫొటోలు బయటకు వచ్చినప్పుడు కూడా, రాజమౌళి సినిమా కోసమే స్పెషల్‌గా వర్కవుట్ చేస్తున్నారనే వార్త వైరల్ అయింది.

అయితే అందులో నిజం లేదని చెప్పేశారు మహేష్. ఇంకా ఆ సినిమా పని మొదలుకాలేదని, అయినప్పుడు తానే షేర్ చేస్తానని కూడా అన్నారు సూపర్‌స్టార్. ఎప్పుడెప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుందా? ఎప్పుడెప్పుడు బోలెడన్ని విషయాలు తెలుస్తాయా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్




