Naveen Polishetty: “చిన్నప్పుడు తనతో సినిమా చేసినట్లు కల కన్నా.. ఇప్పుడు నిజమయ్యింది”
ఇప్పటికే తమ సినిమా ట్రైలర్‌కి, ప్రొమోలకు మంచి స్పందన వచ్చింది అని సంతోషం వ్యక్తం చేశారు నవీన్ పొలిశెట్టి. ఇందులో తాను స్టాండ్ అప్ కామెడీ పాత్ర చేశానట్లు తెలిపారు. నెల్లూరు, విజయవాడ గుంటూరు జిల్లాలో మూవీ ప్రమోషన్ వర్క్ ఫీనిస్ చేశామన్నారు. విశాఖలో ప్రమోషన్‌లో భాగంగా CMR షాపింగ్ మాల్లో ఓ ఈవెంట్, ఆర్ కె బీచ్ ప్రాంతాల్లో చేసిన ప్రమోషన్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు. ఇంకా కాకినాడ, వరంగల్, రాజమండ్రి ప్రాంతాల్లో చిత్ర ప్రమోషన్ వర్క్ వుందని తెలిపారు. డైరెక్టర్ మహేశ్ విశాఖ వ్యక్తే అని తెలిపారు.
మిస్ శెట్టి – మిస్టర్ పొలిశెట్టి సినిమా బృందం సోమవారం విశాఖలో సందడి చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల అవుతుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ విశాఖ చేరుకుంది. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై స్వీటీ బాహుబలి అనుష్క శెట్టి హీరోయిన్‌గా జాతిరత్నాలు ఫేమ్ ననవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” చిత్ర బృందం.. విశాఖ హోటల్ గ్రీన్ పార్క్ లో మీడియా సమావేశం నిర్వహించింది.
హీరో నవీన్ శెట్టి మాట్లాడుతూ.. ఇప్పటికే తమ సినిమా ట్రైలర్‌కి, ప్రొమోలకు మంచి స్పందన వచ్చింది అని సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో తాను స్టాండ్ అప్ కామెడీ పాత్ర చేశానట్లు తెలిపారు. నెల్లూరు, విజయవాడ గుంటూరు జిల్లాలో మూవీ ప్రమోషన్ వర్క్ ఫీనిస్ చేశామన్నారు. విశాఖలో ప్రమోషన్‌లో భాగంగా CMR షాపింగ్ మాల్లో ఓ ఈవెంట్, ఆర్ కె బీచ్ ప్రాంతాల్లో చేసిన ప్రమోషన్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు. ఇంకా కాకినాడ, వరంగల్, రాజమండ్రి ప్రాంతాల్లో చిత్ర ప్రమోషన్ వర్క్ వుందని తెలిపారు. డైరెక్టర్ మహేశ్ విశాఖ వ్యక్తే అని తెలిపారు. చిత్రంలో అనుష్క నుంచి డబుల్ ఎంటర్టైన్‌మెంట్ ఉంటుందన్నారు. ఇది కుటుంబ సమేతంగా చూసే సినిమా అన్నారు. కృష్ణాస్టమి పండగ రోజు విడుదల అయ్యి, అందరినీ అలరిస్తుందని చెప్పారు. తనకు హీరో ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని చెప్పారు. హీరోయిన్ అనుష్కతో కలిసి సినిమా చేస్తాను అని చిన్నపుడు కల వచ్చిందని.. ఇప్పుడు ఆ కల నిజమైందన్నారు నవీన్ పొలిశెట్టి.
చిత్ర దర్శకుడు, రచయిత పి. మహేష్ బాబు మాట్లాడుతూ… విశాఖ వాసిగా విశాఖలో సినిమా ప్రమోషన్ కోసం రావడం సంతోషంగా ఉందని చెప్పారు. హీరో నవీన్ ఎనర్జీ చూపించే సినిమా ఇదన్నారు. మంచి కంటెంట్ వున్న సినిమాలకు విశాఖలో మంచి ఆదరణ వుంటుంది అని పేర్కొన్నారు. పెళ్లి కాకుండా గర్భిణీ అవ్వాలి అనుకునే అమ్మాయి, ఆమెకు సహకరించిన అబ్బాయి కదే ఈ సినిమా అని తెలిపారు. కథ డిమాండ్ ప్రకారం ఈ సినిమా హైదరాబాద్, లండన్ నగరాల్లో షూటింగ్ చేసినట్లు వెల్లడించారు. హీరోయిన్ అనుష్క మధ్యలో 25 కథలు విన్నా సరే తన కథ విని సినిమా అంగీకరించడం సంతోషంగా ఉందని చెప్పారు. నిర్మాతలు వంశీ , ప్రమోద్‌లు మంచి ఉత్తమాభిరుచి గల సినిమా చేశారని కొనియాడారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.