Vadivelu: ప్రముఖ నటుడు వడివేలు ఇంట మరో తీవ్ర విషాదం.. తల్లి మరణం నుంచి తేరుకోకముందే..

ప్రముఖ నటుడు వడివేలు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు జగదీశ్వరన్‌ (55) ఆదివారం (ఆగస్టు 27) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన మధురైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కాలేయ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో జగదీశ్వరన్‌ ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ఆదివారం తుదిశ్వాస విడిచారు. కాగా కొన్ని నెలల క్రితమే వడివేలు తల్లి మరణించారు. ఈ విషాదం నుంచి ఇంకా వడివేలు తేరుకోలేదు.

Vadivelu: ప్రముఖ నటుడు వడివేలు ఇంట మరో తీవ్ర విషాదం.. తల్లి మరణం నుంచి తేరుకోకముందే..
Vadivelu Family
Follow us
Basha Shek

|

Updated on: Aug 28, 2023 | 2:52 PM

ప్రముఖ నటుడు వడివేలు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు జగదీశ్వరన్‌ (55) ఆదివారం (ఆగస్టు 27) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన మధురైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కాలేయ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో జగదీశ్వరన్‌ ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ఆదివారం తుదిశ్వాస విడిచారు. కాగా కొన్ని నెలల క్రితమే వడివేలు తల్లి మరణించారు. ఈ విషాదం నుంచి ఇంకా వడివేలు తేరుకోలేదు. ఇప్పుడు తమ్ముడు కూడా కన్నుమూయడంతో వడివేలు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక జగదీశ్వరన్‌ విషయానికి వస్తే.. వడివేలు లాగే ఇండస్ట్రీలో సత్తాచాటారు. శింబు ‘కాదల్‌ అలైవిట్టలై’ సినిమాతో సహా పలు సినిమాల్లో నటుడిగా మెరిశారు. అయితే వడివేలులా సుదీర్ఘ కాలం సినిమాల్లో కెరీర్‌ కొనసాగించలేకపోయాడు. దీంతో చెన్నై నుంచి మధురై వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డాడు. అక్కడే ఒక వస్త్రాల దుకాణం పెట్టుకుని జీవనం సాగించాడు.

చంద్రముఖి 2తో మళ్లీ..

ఇక వడివేలు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ్‌తో పాటు తెలుగులో సుమారు 200కు పైగ చిత్రాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి మెప్పించారాయన. ముఖ్యంగా చంద్రముఖి సినిమాలో వడివేలు పోషించిన పాత్రను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఇక 23వ పులకేశి సినిమాతో కథానాయకుడిగానూ అదృష్టం పరీక్షించుకున్నారు. కాగా త్వరలో రిలీజ్ కానున్న చంద్రముఖి 2 సినిమాలోనూ ఆయన కనిపించనున్నారు. ఇక ఇటీవల రిలీజైన మామన్నన్‌ (తెలుగులో నాయకుడు) సినిమా వడివేలు కెరీర్‌లోనే మరుపురాని చిత్రంగా మిగిలిపోయింది. ఇందులో ఒక దళిత ఎమ్మెల్యేగా సీరియస్‌ రోల్‌లో నటించి మెప్పించారాయన. ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం వచ్చాయి.

ఇవి కూడా చదవండి

తల్లితో వడివేలు

మామన్నన్ సినిమాలో వడివేలు

చంద్రముఖి 2 సినిమాలో లారెన్స్ తో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్