Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej-Lavanya Tripathi: కాబోయే భార్య పేరును వరుణ్‌ తేజ్‌ తన మొబైల్‌లో ఏమని సేవ్‌ చేసుకున్నాడో తెలుసా?

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మరి కొద్ది రోజుల్లో పెళ్లిపీటలెక్కనున్నారు. 'మిస్టర్', 'అంతరిక్షం' సినిమాల్లో లవ్‌ బర్డ్స్‌గా కనిపించిన ఈ జోడీ త్వరలోనే రియల్‌ కపుల్‌గా మారనున్నారు. సుమారు ఐదేళ్ల పాటు రహస్య ప్రేమాయణం నడిపిన వరుణ్, లావణ్య ఈ ఏడాది జూన్‌ 9న నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు.

Varun Tej-Lavanya Tripathi: కాబోయే భార్య పేరును వరుణ్‌ తేజ్‌ తన మొబైల్‌లో ఏమని సేవ్‌ చేసుకున్నాడో తెలుసా?
Varun Tej, Lavanya Tripathi
Follow us
Basha Shek

|

Updated on: Aug 28, 2023 | 7:58 PM

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మరి కొద్ది రోజుల్లో పెళ్లిపీటలెక్కనున్నారు. ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో లవ్‌ బర్డ్స్‌గా కనిపించిన ఈ జోడీ త్వరలోనే రియల్‌ కపుల్‌గా మారనున్నారు. సుమారు ఐదేళ్ల పాటు రహస్య ప్రేమాయణం నడిపిన వరుణ్, లావణ్య ఈ ఏడాది జూన్‌ 9న నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. కాగా వరుణ్‌- లావణ్యల ప్రేమాయణానికి సంబంధించి అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ టీవీషోకు అతిథిగా వెళ్లాడు మెగా ప్రిన్స్‌. ఈ సందర్భంగా లావణ్యతో పరిచయం, ప్రేమ, పెళ్లి విషయాలపై ఎవరికీ తెలియని విషయాలను బయటపెట్టాడు వరుణ్‌. తన మొబైల్‌లో లావణ్య పేరుని ఎలా సేవ్ చేసుకున్నాడు అని ఆడియెన్స్‌ ప్రశ్నించగా, ‘LAVN’ అని సమాధానమిచ్చాడు వరుణ్‌. లావణ్యనే తన ఫోన్‌ తీసుకుని అలా సేవ్‌ చేసిందని చెప్పుకొచ్చాడు వరుణ్‌.

ఇక లావణ్యకు మొదటి గిఫ్ట్‌ ఏమిచ్చారని అడిగితే.. తనకు గుర్తు లేదని, మా ఇద్దరి రిలేషన్‌ షిప్‌ ప్రారంభమై చాలా ఏళ్లు అయిందన్నాడు వరుణ్‌. ఇక చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లలో ఎవరి మేనరిజం అనుకరించడానికి ఇష్టపడతారని అడిగితే.. ఇద్దరి మేనరిజమ్స్‌ తనకు ఇష్టమేనన్నాడు మెగా ప్రిన్స్‌. ఇక వివాహమయ్యాక రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌లలో ఎవరిలో ఎక్కువ మార్పులు వచ్చాయని ప్రశ్నిస్తే.. పెళ్లయ్యాక ఎవరైనా మారిపోవాల్సిందేనంటూ ఆన్సరిచ్చాడు వరుణ్‌. కాగా మెగా ప్రిన్స్‌ నటించిన గాంఢీవధారి అర్జున ఆగస్టు 25న గ్రాండ్‌గా రిలీజైంది. ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. నాజర్‌, విమలా రామన్‌, వినయ్‌ రాయ్‌, రోషిణి, అభినవ్‌ గోమతం తదితరులు కీలక పాత్రలు పోషించగా, మిక్కీజే మేయర్‌ సంగీతం అందించాడు. గని ఫ్లాప్‌ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ కూడా వరుణ్‌కు నిరాశనే మిగిల్చింది.

ఇవి కూడా చదవండి

లావణ్య త్రిపాఠి లేటెస్ట్  ఇన్ స్టాగ్రామ్  పోస్ట్

 ఫారిన్ వెకేషన్ లో  లావణ్య త్రిపాఠి

వరుణ్ తేజ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.