AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boys Hostel: స్టూడెంట్స్‌కు బంపరాఫర్‌ .. ‘బాయ్స్‌ హాస్టల్‌’ ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. థియేటర్ల లిస్టు ఇదుగో..

ఆగస్టు 26న విడుదలైన బాయ్స్‌ హాస్టల్‌ తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్‌ వద్ద మోస్తరు వసూళ్లు వస్తున్నాయి. కాగా బాయ్స్‌ హాస్టల్‌ మూవీ నిర్మాతలు ఒక బంపరాఫర్‌ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఒక టికెట్‌ కొంటె మరొకటి ఉచితంగా పొందవచ్చని తెలిపారు. బుధవారం (ఆగస్టు 30) నుంచి ఈ ఆఫర్‌ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అది కూడా కేవలం...

Boys Hostel: స్టూడెంట్స్‌కు బంపరాఫర్‌ .. 'బాయ్స్‌ హాస్టల్‌' ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. థియేటర్ల లిస్టు ఇదుగో..
Boys Hostel Movie
Basha Shek
|

Updated on: Aug 29, 2023 | 9:25 PM

Share

కన్నడలో చిన్న సినిమాగా విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది హాస్ట‌ల్ హుదుగురు బెక‌గిద్దారే. నితిన్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంజునాథ్ నాయక, ప్రజ్వల్ బీపీ, శ్రీవత్స శ్యామ్, గగన్ రామ్, శ్రేయస్ శర్మ తదితరులు నటించారు. యూత్‌ ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ జులై 21న విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఇదే సినిమాను ‘బాయ్స్‌ హాస్టల్‌’ పేరుతో రిలీజ్‌ చేశారు. కన్నడలో స్టార్‌ హీరో రక్షిత్‌ శెట్టి ఈ సినిమాను విడుదల చేస్తే తెలుగులో అన్నపూర్ణ స్టూడియో, ఛాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా రిలీజ్‌ చేశాయి. అలాగే కన్నడ వెర్షన్‌లో రక్షిత్‌ శెట్టి, రమ్య పాత్రల్లో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన తరుణ్‌ భాస్కర్‌, రష్మీ గౌతమ్‌ కనిపించడం విశేషం. ఆగస్టు 26న విడుదలైన బాయ్స్‌ హాస్టల్‌ తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్‌ వద్ద మోస్తరు వసూళ్లు వస్తున్నాయి. కాగా బాయ్స్‌ హాస్టల్‌ మూవీ నిర్మాతలు ఒక బంపరాఫర్‌ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఒక టికెట్‌ కొంటె మరొకటి ఉచితంగా పొందవచ్చని తెలిపారు. బుధవారం (ఆగస్టు 30) నుంచి ఈ ఆఫర్‌ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అది కూడా కేవలం స్టూడెంట్స్‌ కు మాత్రమే ఇది వర్తిస్తుందని సూచించారు. థియేటర్లలోని కౌంటర్లలో ఈ టికెట్లు పొందవచ్చని మేకర్స్‌ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు సంబంధించి థియేటర్ల లిస్టును సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్‌ చేశారు. నైజాం ఏరియాలో 34 థియేటర్లు, సీడెడ్‌లో 5, కృష్ణా జిల్లాలో 2, నెల్లూరు ఒకటి, వైజాగ్‌లో ఒక థియేటర్లలో ఈ ఆఫర్‌ వర్తిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు బాయ్స్‌ హాస్టల్‌ ఒరిజనల్‌ వెర్షన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ ఖరారయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ 5లో సెప్టెంబర్‌ 1 నుంచి ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ స్ట్రీమింగ్‌ కానుంది. అయితే తెలుగు వెర్షన్‌ చూడాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాకు అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరాలు సమకూర్చారు. మరి రక్షాబంధన్‌ రోజున మంచి సినిమా చూడాలంటే బాయ్స్‌ హాస్టల్‌ మంచి ఛాయిస్‌. పైగా ఎలాగో వన్‌ప్లస్‌ వన్‌ ఆఫర్‌ ఉంది.

థియేటర్ల లిస్టు ఇదే..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్