Shah Rukh Khan Jawan: షారుఖ్‌ క్రేజ్‌ అలాంటిది మరి.. 51 ఏళ్ల చరిత్రను తిరగరాసేలా ‘జవాన్‌’ స్పెషల్‌ షోస్‌

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం 'జవాన్' మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 7న విడుదలవుతున్న ఈ సినిమా క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. సినిమా విడుదలకు ముందే స్ట్రాంగ్ ట్రెండ్ క్రియేట్ అయ్యింది. ' జవాన్ ' సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను చూస్తుంటే సినిమా భారీ కలెక్షన్లు రాబట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక షారుఖ్ ఖాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Shah Rukh Khan Jawan: షారుఖ్‌ క్రేజ్‌ అలాంటిది మరి.. 51 ఏళ్ల చరిత్రను తిరగరాసేలా 'జవాన్‌' స్పెషల్‌ షోస్‌
Shah Rukh Khan Jawan Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 29, 2023 | 8:12 PM

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం ‘జవాన్’ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 7న విడుదలవుతున్న ఈ సినిమా క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. సినిమా విడుదలకు ముందే స్ట్రాంగ్ ట్రెండ్ క్రియేట్ అయ్యింది. ‘ జవాన్ ‘ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను చూస్తుంటే సినిమా భారీ కలెక్షన్లు రాబట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక షారుఖ్ ఖాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోట్లాది అభిమానులు అతనిని ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో జవాన్‌ రిలీజును పురస్కరించుకుని ఒక సరికొత్త రికార్డును లిఖించేందుకు ఆయన అభిమానుల సంఘం ముందుకు వచ్చింది. ముంబైలో ప్రముఖ థియేటర్‌ ‘గైటీ గెలాక్సీ’ ఉదయం 6 గంటలకు ‘జవాన్‌’ సినిమా స్పెషల్‌ షో ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా 51 ఏళ్ల చరిత్ర ఉన్న ‘గైటీ గెలాక్సీ’ లో మార్నింగ్‌ 6 గంటలకే స్క్రీనింగ్‌ కానున్న తొలి బాలీవుడ్ సినిమాగా షారుఖ్‌ జవాన్‌ నిలవనుంది. షారుక్ ఖాన్ ‘ఎస్.ఆర్.కె. ‘యూనివర్స్’ సంఘం ఈ షో కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గురువారం (సెప్టెంబర్ 7) ఉదయం 6 గంటలకు ‘గైటీ గెలాక్సీ’ ఫస్ట్ డే ఫస్ట్ షో ఏర్పాటుచేయనున్నారు. ఇదే అభిమానుల సంఘం షారుఖ్‌ గత సినిమా ‘పఠాన్’ రిలీజ్‌ను కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. ‘ఇంతకుముందు, షారుఖ్‌ ఖాన్‌ పఠాన్ చిత్రాన్ని ఉదయం 9 గంటలకు ప్రదర్శించడం ద్వారా 51 ఏళ్ల రికార్డును తిరగరాశాం. ఇప్పుడు జవాన్‌ సినిమాతో మళ్లీ చరిత్ర లిఖించే సమయం వచ్చింది’ అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు షారుఖ్‌ ఫ్యాన్స్‌.

కాగా ఆగస్ట్ 31న దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా భవనంలో షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. షారూఖ్ ఖాన్‌కు దుబాయ్‌లో చాలా మంది అభిమానులు ఉన్నారు. అతను తరచూ దుబాయ్‌కి వెళ్తుంటాడు. దుబాయ్ టూరిజం అంబాసిడర్ కూడా. ఈరోజు (ఆగస్టు 29) ‘నాట్ రామయ్యా వస్తావయ్యా’ పాట విడుదలకానుంది. ‘రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ ద్వారా గౌరీఖాన్‌ ‘జవాన్‌’ చిత్రాన్ని నిర్మించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. భారీ అంచనాలున్న ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన ‘పఠాన్’ 2023 ప్రారంభంలో విడుదలైంది. వివాదాస్పదమైనప్పటికీ, సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ‘జవాన్’ కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు..

పార్టీ మొదలైంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..