Actress: సాయంకాలాన.. సాగర తీరాన.. సూర్యుడితో పోటీపడుతూ అందాల తార పోజులు.. ఎవరో గుర్తుపట్టారా?

సాయం కాలాన.. సాగర తీరాన.. సూర్యుడితో పోటీపడుతూ పోజులిస్తోన్న ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా? టాలీవుడ్‌లో ఈమె స్టార్‌ హీరోయిన్‌. తన అందం, అభినయంతో ఇక్కడ బోలెడు అభిమానులను సొంతం చేసుకుంది. ఒక్క తెలుగులోనే కాదు తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈమెకు క్రేజ్‌ ఉంది. స్టార్‌ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ అలరిస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే..

Actress: సాయంకాలాన.. సాగర తీరాన.. సూర్యుడితో పోటీపడుతూ అందాల తార పోజులు.. ఎవరో గుర్తుపట్టారా?
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Aug 30, 2023 | 9:49 PM

సాయం కాలాన.. సాగర తీరాన.. సూర్యుడితో పోటీపడుతూ పోజులిస్తోన్న ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా? టాలీవుడ్‌లో ఈమె స్టార్‌ హీరోయిన్‌. తన అందం, అభినయంతో ఇక్కడ బోలెడు అభిమానులను సొంతం చేసుకుంది. ఒక్క తెలుగులోనే కాదు తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈమెకు క్రేజ్‌ ఉంది. స్టార్‌ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ అలరిస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ అందాల తార చాలామందికి ఆదర్శం. ప్రొపెషనల్‌ లైఫ్‌తో పాటు పర్సనల్‌ లైఫ్‌లోనూ పలు ఇబ్బందులు ఎదుర్కొన్నా పడిలేచిన కెరటంలా మళ్లీ దూసుకొచ్చింది. ఓ భయంకరమైన వ్యాధికి చికిత్స తీసుకుంటూనే సినిమాలు, వెబ్‌ సిరీసుల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్‌. పై ఫొటోలో ఉన్నది మరెరవో కాదు.. సమంత. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోన్న ఆమె ఎప్పటికప్పుడు తన ఫొటోలోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తోంది. అలా సాగరతీరాన సంధ్యావేళలో సమంత దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకున్నాయి.

శుక్రవారం రిలీజ్ కానున్న ఖుషి సినిమా 

కాగా సమంత నటించిన ఖుషి సినిమా శుక్రవారం (సెప్టెంబర్‌ 1) న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. శివనిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీలో విజయ్‌ దేవరకొండ హీరో. మైత్రీ మూవీ మేకర్స బ్యానర్‌పై నవీన్‌ యెర్నేనీ, యలమంచిలి రవిశంకర్‌ ఈ ఫీల్‌ గుడ్ సినిమాను నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో ఖుషి సినిమా రిలీజ్‌ కానుంది. హిషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా ఖుషి సినిమా తర్వాత సిటాడెబ్‌ అనే హిందీ వెబ్‌ సిరీస్‌తో మన ముందుకు రానుంది సమంత. ఇందులో వరుణ్‌ ధావన్‌ హీరోగా కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సిరీస్‌ కూడా స్ట్రీమింగ్‌ కు రానుంది.

ఇవి కూడా చదవండి

సమంత ఇన్ స్టాగ్రామ్ ఫొటోస్

అమెరికాలో సమంత 

సమంత ఇన్ స్టాగ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో