Athidhi Web Series: హార్రర్‌ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న వేణు .. ‘అతిథి’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

వెంకటేష్‌ చింతకాయల రవి, ఎన్టీఆర్‌ దమ్ము, రవితేజ రామారావు ఆన్‌ డ్యూటీ సినిమాల్లో స్పెషల్‌ రోల్స్‌తో సందడి చేశాడు వేణు తొట్టెంపూడి. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. త్వరలోనే ఓ హారర్‌ వెబ్‌ స్టోరీతో మనల్ని పలకరించేందుకు రెడీ అయ్యాడు. అతిథి పేరుతో రూపొందిన ఈ సిరీస్‌కు సంబంధించి తాజాగా టీజర్‌ రిలీజైంది.

Athidhi Web Series: హార్రర్‌ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న వేణు .. ‘అతిథి’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Venu Thottempudi Athidhi Web Series
Follow us
Basha Shek

|

Updated on: Sep 08, 2023 | 5:40 PM

సుమారు పాతికేళ్ల క్రితం స్వయంవరం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు వేణు తొట్టెంపూడి. తనదైన యాక్టింగ్‌, కామెడీతో మొదటి సినిమాతోనే సూపర్‌ హిట్ కొట్టేశాడు. ఆ తర్వాత చిరునవ్వుతో, హనుమాన్‌ జంక్షన్‌, కల్యాణ రాముడు, పెళ్లాం ఊరెళితే, పెళ్లాంతో పనేంటి, ఖుషి ఖుషిగా, చెప్పవే చిరుగాలి, సదా మీ సేవలో, శ్రీకృష్ణ 2006, అల్లరే అల్లరి, యమగోల మళ్లీ మొదలైంది, గోపి గోపిక గోదావరి, తదితర సూపర్‌ హిట్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువయ్యాడు. అయితే ఆ తర్వాత వరుసగా పరాజయాలు పలకరించడంతో ఫేడవుట్‌ అయిపోయాడు. అయితే హీరోగా కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. వెంకటేష్‌ చింతకాయల రవి, ఎన్టీఆర్‌ దమ్ము, రవితేజ రామారావు ఆన్‌ డ్యూటీ సినిమాల్లో స్పెషల్‌ రోల్స్‌తో సందడి చేశాడు వేణు. ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. త్వరలోనే ఓ హారర్‌ వెబ్‌ స్టోరీతో మనల్ని పలకరించేందుకు రెడీ అయ్యాడు. అతిథి పేరుతో రూపొందిన ఈ సిరీస్‌కు సంబంధించి తాజాగా టీజర్‌ రిలీజైంది. వర్షంలో ఓ పురాత‌న భ‌వనంలోకి యువతి అడుగుపెడుతుంది. అక్కడ వేణుతో ఇక్కడ ఉండొచ్చా అని అడుగుతుంది. ఆ తర్వాత వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అయితే ఇంతలోనే ఆమె చాలా భయంకరంగా ప్రవర్తించడంతో టీజర్ ముగుస్తుంది.

హార్రర్, సస్పెన్స్ తో ఆసక్తికరంగా టీజర్

హారర్‌, రొమాన్స్‌, సస్పెన్స్‌తో సాగిన ఈ టీజర్‌వెబ్‌ సిరీస్‌పై మరింత ఆసక్తిని రేకెత్తించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో సెప్టెంబర్‌ 19 నుంచి అతిథి వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ వెబ్‌సిరీస్‌లో వేణు తొట్టెంపూడితో పాటు అవంతికా మిశ్రా కీ రోల్‌ పోషిఇంచింది. అయితే ఈ హార్రర్‌ సిరీస్‌కు దర్శకుడు, నిర్మాతలు, ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

ఇవి కూడా చదవండి

‘అతిథి’ వెబ్ సిరీస్ టీజర్ 

వేణు ఫస్ట్ లుక్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో