BRO OTT: ఓటీటీలో అదరగొడుతున్న పవన్ కల్యాణ్, తేజ్‌ల ‘బ్రో’.. పాక్, బంగ్లాలోనూ రికార్డు.. ఎక్కడ చూడొచ్చంటే?
థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న బ్రో మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ పవన్ కల్యాణ్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. గత శుక్రవారం (ఆగస్టు 25) నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. కాగా స్ట్రీమింగ్‌కు వచ్చి ఆరు రోజులవుతన్నా బ్రో సినిమా నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్స్ లో టాప్ లో నిలవడం విశేషం.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన తాజా చిత్రం ‘బ్రో.. ది అవతార్’ . సముద్రఖని తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కేతికా శర్మ, ప్రియాంకా వారియర్, వెన్నెల కిశోర్, రోహిణీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జులై 28న థియేటర్లలో విడుదలైన ఈ మెగా మల్టీ స్టారర్ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. విడుదలైన మొదటి మూడురోజుల్లోనే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి పవర్ స్టార్ సామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న బ్రో మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ పవన్ కల్యాణ్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. గత శుక్రవారం (ఆగస్టు 25) నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. కాగా స్ట్రీమింగ్‌కు వచ్చి ఆరు రోజులవుతన్నా బ్రో సినిమా నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్స్ లో టాప్ లో నిలవడం విశేషం. ఇక వరల్డ్ వైడ్‌గా అయితే ఇంగ్లిష్ క్యాటగిరిలో 7వ ప్లేస్‌లో, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో 8వ స్థానంలో నిలిచింది బ్రో.. ది అవతార్.
కాగా ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది బ్రో. మొత్తానికి అటు థియేటర్లలోనూ, ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తోంది బ్రో సినిమా. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన డైలాగులు, పవన్ వింటేజ్ లుక్స్, మేనరిజమ్స్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పుకోవచ్చు. ఇక థమన్ అందించిన బీజీఎమ్ ఓ రేంజ్‌లో హైలెట్ అవుతోంది. పీపుల్స్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ మెగా మల్టీస్టారర్‌ను నిర్మించారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ లోనూ ..
India No #1 trending Bro Movie 💥🔫💥💥💥✨✨#BroTheAvatar is among the Top 10 Non-English Films on Netflix globally & No #1 in india 🇮🇳 & No 8 In Pakistan🇵🇰 & Bangladesh🇧🇩
Ustaad @PawanKalyan going global.
||#TheyCallHimOG| #OGTeaser | #HUNGRYCHEETAH|| pic.twitter.com/3Jje77ADP3
— OG Pspk (@NanamPavan) August 30, 2023
ఖుషీ అవుతోన్న మెగా ఫ్యాన్స్
#BRO movie trending on Netflix Hindi💥💥 Trending in Bangladesh, India & Pakistan 💥💥💥 Massive response on OTT#PawanKalyan #bollywoodactress #Bollywood #Hindi #IndiaVsPakistan pic.twitter.com/DGD0QeXLuN
— 13 (@Bharat13ala) August 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..