Krishna Mukunda Murari 31st August: తన ప్రేమను కృష్ణకు చెప్పాలనుకున్న ముకుందకు షాక్.. ఆనందంలో కృష్ణ.. మురారీలు..
స్టార్ మాలో ప్రసారం అవుతున్న కృష్ణ ముకుంద మురారీ సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రేమించిన ప్రియురాలి పంతానికి, భార్య ప్రేమకు మధ్య ఓ యువకుడి కథతో సాగుతున్న కృష్ణ ముకుంద మురారీ బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణ సొతం చేసుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. ఓ వైపు ముకుంద కృష్ణ జ్ఞాపకాలను మురారీ నుంచి చెరిపివేయాలని భావిస్తుంది.. మరోవైపు కృష్ణ మళ్ళీ తన అత్తవారింటికి వస్తుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు ఏమి జరుగుతుందో చూద్దాం..
మురారీ.. తాను క్యాంప్ లో పిల్లల్ని కాపాడిన సంఘటన గురించి చెబుతుంటే.. నువ్వు పిల్లని కాపాడితే..నిన్ను నీ పెళ్ళాం కాపాడింది కదా అంటుంది భవానీ.. ఇంతలో కృష్ణ తన రూమ్ కి మెట్లు ఎక్కుతూ.. అసలు ఇప్పటి వరకూ తాను తన రూమ్ కి ఎన్ని మెట్లు ఎక్కి వెళ్ళుతున్నానో తెలియదు కదా అంటూ మెట్లు లెక్కించి పని పెట్టుకుంటుంది. భవానీ ఏమిటిరా కలర్ వచ్చావు.. డైట్ కానీ మార్చావా అంటే.. ప్రేమ లో పడితే అంతే అట పెద్దమ్మ.. కృష్ణ ప్రేమలో పూర్తిగా మునిగిపోయా.. కానీ ముకుంద టార్చర్ తట్టుకోలేకపోతున్నా అనుకుంటాడు తనలో తాను మురారీ.. ఏమి మాట్లాడలేదు.. అంటే మనం ముందు నుంచి కలర్ కదా అంటూ నేను ఇప్పుడే వస్తా పెద్దమ్మ అంటూ.. కృష్ణ మెట్లను లెక్కించడం చూస్తూ.. ఆ ఫోటోలను ఎలా గదిలో నుంచి తీసెయ్యాలి.. కృష్ణ కనుక ఇప్పుడు ముకుందతో నా ఫోటోలు చూస్తే.. నా ప్రేమ విషయం తెలిసిపోతుంది ఏమి చెయ్యాలి అనుకుంటుంటే.. ముకుంద మురారీ ఎదురుగా నిల్చుని మురారీ ఎటు కదలకుండా చేస్తుంది. ముకుంద ప్లీజ్ ఎవరైనా చుస్తే బాగుండదు అని అంటే.. నీకోసం నీ ప్రేమ కోసం నేను పిచ్చిదానిలా ఎదురుచూస్తూ ఉంటే.. నా ప్రేమని పక్కకు పెట్టి.. కృష్ణ తో ప్రేమలో పెడతావా చెబుతా నీ సంగతి అంటూ కృష్ణ దగ్గరకు వెళ్తుంది.
కృష్ణకు తన ప్రేమని చెప్పాలనుకున్న ముకుంద..
కృష్ణ దగ్గరకు వెళ్లి ఏమిటి కృష్ణ లెక్కపెడుతున్నావు.. 35 మెట్లున్నాయి. లెక్కపెట్టాను. నీ తింగరి తనమే అందరికి నచ్చుతుంది అని అంటుంటే.. భవానీ మురారీ దగ్గరకు వచ్చి ముకుంద సంగతి చూడు అని అంటుంది.. ఇంతలో ముకుంద కృష్ణ నీకు ఒక ఫోటో చూపించాలి అంటుంటే.. లడక్ లో మా ఫోటోలు చూపిస్తుందా.. దేవుడా ప్లీజ్ సేవ్ మీ అనుకుంటాడు మురారీ.
కృష్ణ కు ముకుంద తన ఫోన్ లోని ఒక ఫోటో చూపిస్తుంది. మురారీ వైపు వినోదంగా చూస్తుంది. తర్వాత ఇప్పుడు ఒక ఫోటో చూపించాను కదా.. ఇప్పుడు నేను గదిలోకి వెళ్లి.. ఫోటోలు తీసేద్దామనుకుంటే అప్పుడు ఇంకా తప్పు చేసినవాడిని అవుతాను.. అప్పుడెప్పుడో తెలియక నిన్ను ప్రేమించా.. ఇప్పుడు అన్నీ తెలిసి ఆ తప్పు చెయ్యలేను అనుకుంటాడు మురారీ. నా మనసులో కృష్ణకు తప్ప ఇంకెవరికి స్థానం లేదు.. ఎన్ని నిందలు వేసినా సహిస్తాను.. ఎంత అసహ్యయించుకున్న భరిస్తాను.. అనుకుంటూ వాళ్ళిద్దరి దగ్గరకు వస్తాడు.
మురారీ కృష్ణను తీసుకుని వెళ్ళు.. ఏసీపీ సార్ మన గదిలోకి వెళ్దాం.. అంటే ఇప్పుడు ఎందుకు కృష్ణ ఇప్పుడే వచ్చాము కదా అన్ని మిస్ అయ్యాం కదా.. అంటే మెడిసిన్ వేసుకోవాలి.. పదండి మన గదిలోకి అంటుంది కృష్ణ. ఇన్నాళ్లు మనం క్యాంప్ లో ఉన్నాం కదా ఆ సోఫా, ప్లేట్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా అంటుంటే.. కృష్ణ అరే ఏసీపీ సార్.. మీరు ఎదో పది 10 ఏళ్ళు క్యాంప్ లు ఉన్నట్లు ఫేల్ అవుతున్నారేమిటి మనం వెళ్ళింది 10 రోజులే.. అంటుంటే.. సరే మీరు ఇక్కడే ఉండి ఈ సోఫాని ఈ ఫిల్లోని అన్నింటిని చూస్తూండండి.. నేను పైకి వెళ్లి రెస్ట్ తీసుకుంటాను. అంటే ఇప్పుడు కృష్ణ గదిలోకి ఎందుకు .. ఇక్కడ ఉందాం అంటాడు మురారీ. అసలే మనది ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబం అంటాడు.
రూమ్ లోకి వెళ్లకుండా ఆపడానికి ట్రై చేసిన మురారీ..
ముకుంద కృష్ణను, మురారీని చూసి ఇంకా వెళ్లడం లేదు అనుకుంటే.. కృష్ణ మురారీని పైకి తీసుకుని వెళ్తే.. బాంబ్ పేలనుంది అనుకుంటే.. ఇలా కాదు కానీ.. మనమే ఛార్జ్ తీసుకోవాలి.. అనుకుంటూ కృష్ణ దగ్గరకు వచ్చి ఇందాక ఒక ఫోటో చూపించా కదా.. ఇప్పుడు అంతకు మించి సర్ప్రైజ్ ఇస్తాను పద అంటూ కృష్ణ కళ్లు మూసి వాళ్ళ రూమ్ కి ముకుంద తీసుకుని వెళ్తుంటే.. మురారీ ఇంత వరకూ వచ్చాక ఆలోచించేంది ఏముంది మనం కూడా నిజం చెప్పేదాం అనుకుంటాడు మురారీ..
ముకుందకు షాక్
కృష్ణను రూమ్ కి తీసుకుని వచ్చిన ముకుంద షాక్ తింటుంది.. ఎందుకంటే అక్కడ వెల్కమ్ టూ కృష్ణ అని ఉంటుంది. మురారీ ముకుంద రియాక్షన్ చూసి ఏమిటి అని వస్తాడు .. అక్కడ కృష్ణ కు స్వాగతం చెబుతున్నట్లు ఉన్న అక్షరాలు చూసి హ్యాపీగా కృష్ణ కళ్లు తెరవచ్చా అని అంటే.. తెరవచ్చు అని అంటాడు.. కళ్లు తెరచి అక్కడ తనకు స్వాగతం చెబున్నట్లు ఉన్న బోర్డు ని చూసి హ్యాపీ ఫీల్ అవుతుంది. థాంక్యూ ముకుంద థాంక్యూ అని ముకుందని కృష్ణ హత్తుకుంటే.. మై ప్లెజర్ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ముకుంద.
దేవుడిని ప్రార్థిస్తున్న రేవతి
ముకుంద ఇందాక ఒక ఫోటో చూపించింది కదా ఏమిటా ఫోటో అంటే.. అచ్చు నాకులా ఉన్న ఒక అమ్మాయి నేపాల్ ఉంటుందట.. అంటే మనుషులను పోలిన మనుషులుంటారు కానీ.. నీకులాంటి మనిషి ఇంకెక్కడా ఉండరు అని అంటాడు మురారి. ఇప్పుడు టాబ్లెట్ వేసుకోండి. అని అంటే. వెల్కమ్ కృష్ణ ని ఎవరు రాశారు అని ఆలోచిస్తుంటే… రేవతి స్వామి ఇన్నాళ్లకు నా కోరిక మన్నించావు.. వెళ్లిపోతున్న బిడ్డని వెనక్కి తీసుకొచ్చావు.. ఇప్పడు నాకు నమ్మకం వచ్చింది స్వామి.. వాళ్లిద్దరూ కలిసి ఉంటారని.. వాళ్ళ ప్రేమని వారు తొందరగా అర్ధం చేసుకుని వాళ్లిద్దరూ సంతోషంగా ఉండాలి.. అదే విధంగా ఆదర్శ్ కూడా తీసుకొచ్చి.. ముకుంద మనసు మార్చుని సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది. ఈ ఒక్కటి చేశావంటే చాలు.. ఇంతకూ మించి నిన్ను మీ అడగను ఒట్టు అని రేవతి దేవుడిని ప్రార్ధిస్తుంది.
ఇంజెక్షన్ చూసి భయంతో మురారీ..
మురారీ.. ముకుంద పెట్టిన టెన్షన్ కు బుర్ర బ్లాస్ట్ అయింది. ఎక్కడ ముకుందతో ఉన్న ఫోటోలు ఎక్కడ చూస్తుందో అని టెన్షన్ పెట్టాను.. మరి అయితే ఎవరు ముకుంద పెట్టిన మేటర్ ను మార్చి వెల్కమ్ తో కృష్ణ అని రాసి ఉంటారు.. ఇంకెవరు అమ్మే అయి ఉంటుంది అని అనుకుంటాడు మురారీ. తానే కదా ఎప్పుడు నన్ను కాపాడేది.. మా మంచి అమ్మ.. ఐ లవ్ యూ అమ్మ అని అనుకుంటుంటే.. కృష్ణ మెడిసిన్స్ తెస్తుంది. మురారీ ఇంజెక్షన్ చూసి భయంతో పారిపోతుంటే.. వద్దు అంటే ఎలా తీసుకోవాల్సిందే.. నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి చాలా భయం అంటే.. మీరు పెద్ద అయ్యారు పైగా ఏసీపీ సార్ మీరు అంటే.. మనం ఎంత ఎదిగినా కొన్ని ఇష్టాలు, భయాలు పోవు అంటే.. తప్పదు ఇంజెక్షన్ తీసుకోవాల్సిందే అంటుంది కృష్ణ. నాకు బుల్లెట్స్ అన్నా భయం ఉండదు కానీ ఇంజెక్షన్ అంటే భయం అంటూ కృష్ణకు దొరకకుండా పారిపోతాడు.. కృష్ణ మురారీని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.
రేపటి ఎపిసోడ్లో..
కృష్ణ ఎందుకు తిరిగివచ్చింది.. కొంపదీసి మురారీకూడా తనను ప్రేమిస్తున్నది తెలిసిపోయిందా అని ఆలోచిస్తుంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి