- Telugu News Photo Gallery Cinema photos Icon Star Allu Arjun Give Competition for Tollywood Top Hero's Telugu Entertainment Photos
Allu Arjun: జక్కన్న టచ్ చెయ్యకుండానే ఉన్నత శిఖరాలకు , నార్త్ హీరోస్ కు బన్నీ గట్టిపోటీ.
పుష్ప సినిమా విడుదలైనప్పటి నుంచీ, పార్టీ గురించి మాట్లాడాల్సిన ప్రతి సందర్భంలోనూ వాడిన లైన్... పార్టీ లేదా పుష్పా?అనేదే. ఇన్నాళ్లూ అందరూ అడుగుతుంటే సైలెంట్‌గా ఉన్న బన్నీ, ఇప్పుడు ఎందుకు లేదూ... ఈ వీకెండ్‌కి వచ్చేయండీ అంటున్నారు.ఫస్ట్ నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఇచ్చే వీకెండ్ పార్టీకి గెస్ట్ లిస్ట్ ప్రిపేర్ అవుతోంది. ఇంతకు ముందు టాలీవుడ్‌లో ఏ హీరో ఎక్స్ పీరియన్స్ చేయని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు అల్లు అర్జున్.
Updated on: Aug 31, 2023 | 7:29 PM

పుష్ప సినిమా విడుదలైనప్పటి నుంచీ, పార్టీ గురించి మాట్లాడాల్సిన ప్రతి సందర్భంలోనూ వాడిన లైన్... పార్టీ లేదా పుష్పా?అనేదే. ఇన్నాళ్లూ అందరూ అడుగుతుంటే సైలెంట్‌గా ఉన్న బన్నీ, ఇప్పుడు ఎందుకు లేదూ... ఈ వీకెండ్‌కి వచ్చేయండీ అంటున్నారు.

ఫస్ట్ నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఇచ్చే వీకెండ్ పార్టీకి గెస్ట్ లిస్ట్ ప్రిపేర్ అవుతోంది. ఇంతకు ముందు టాలీవుడ్‌లో ఏ హీరో ఎక్స్ పీరియన్స్ చేయని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు అల్లు అర్జున్. పార్టీ లేదా పుష్పా అని అందరూ నాన్‌స్టాప్‌గా అడుగుతూ ఉండటం వల్లనో ఏమో, గట్టిగా పార్టీ ఇచ్చే అవకాశం వచ్చేసింది బన్నీకి.

టాలీవుడ్‌లో నేషనల్ అవార్డు అందుకుంటున్న తొలి హీరోగా పేరు పదిలం చేసుకున్నారు ఐకాన్ స్టార్. అందుకే ఈ వీకెండ్ అద్దిరిపోయే పార్టీని అరేంజ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ప్యాన్ ఇండియా లెవల్లో ప్రూవ్ చేసుకున్న తెలుగు హీరోలు ప్రభాస్, తారక్ అండ్ రామ్‌చరణ్.

వీరందరినీ ముంబై వైపు వేలు పట్టుకుని నడిపించారు జక్కన్న. అయితే రాజమౌళి హెల్ప్ లేకుండానే ప్యాన్ ఇండియా లెవల్లో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు సిల్వర్‌స్క్రీన్ పుష్పరాజ్. పుష్ప సినిమా ప్రీ రిలీజ్ టైమ్‌లో నార్త్ లో అద్భుతమైన బజ్ అయితే లేదు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక సినిమా కాన్సెప్ట్, బన్నీ నటన, డ్యాన్సులు, ఫైట్లు, బ్యాక్‌డ్రాప్...

ఇలా ప్రతిదీ నచ్చేసింది నార్త్ ఆడియన్స్ కి. ఊ అంటావా పాటయితే ప్యాన్ ఇండియా లెవల్లో ఓ ఊపు ఊపేసింది. ప్యాన్ ఇండియా రేంజ్‌లో అంత పెద్ద హిట్ సాధించడమే సూపర్ అని అనుకున్నారు... అల్లు ఫ్యాన్స్. ఇప్పుడైతే అల్లు ఆర్మీ ఆనందానికి బోసన్ వచ్చినట్టు నేషనల్ అవార్డు వచ్చింది. ఇక సెలబ్రేషన్స్ మామూలుగా ఉంటాయా?

ప్రెజెంట్... రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న పుష్ప2 షెడ్యూల్ ఇంకో రెండు,మూడు రోజులు ఉంటుంది. ఆ వెంటనే బ్రేక్ తీసుకుని ఇండస్ట్రీని పార్టీకి పిలుస్తున్నారు బన్నీ. ఈ వీకెండ్ అంతా బన్నీ పార్టీమయం అన్నమాట.




