Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఫ్యాన్స్‌కు బంపరాఫర్.. సెట్‌లో కూర్చొని లైవ్‌లో షో చూసే ఛాన్స్.. ఏం చేయాలంటే?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ సీజన్ 7కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్‌గా ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ ఫేమస్ రియాల్టీ షో మరికొన్ని గంటట్లో లాంఛ్ కానుంది. ఆదివారం (సెప్టెంబర్ 3) సాయంత్రం నుంచి ఈ గేమ్ షో స్టార్ట్ కానుంది. ఇప్పటికే బిగ్‌బాస్ షోకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ సీజన్ 7కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్‌గా ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ ఫేమస్ రియాల్టీ షో మరికొన్ని గంటట్లో లాంఛ్ కానుంది. ఆదివారం (సెప్టెంబర్ 3) సాయంత్రం నుంచి ఈ గేమ్ షో స్టార్ట్ కానుంది. ఇప్పటికే బిగ్‌బాస్ షోకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత సీజన్లలో మాదిరిగానే ఏడో సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆరో సీజన్‌పై విమర్శలను దృష్టిలో ఉంచుకుని తాజా సీజన్‌లో పలు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కంటెస్టెంట్ల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ‘ఉల్టా పుల్టా’ అంటూ నాగార్జున కూడా ఏడో సీజన్ డిఫరెంట్‌గా ఉంటుదని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు రిలీజైన ప్రోమోల్లోనూ ఇది స్పష్టమైంది. కాగా బిగ్‌బాస్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించారు మేకర్స్. అదేంటంటే.. ఈ రియాల్టీ షో సుమారు మూడు నెలల పాటు సాగనుంది. అయితే ఒక రోజులో జరిగే విషయాలను కేవలం గంట మాత్రమే ప్రసారం చేస్తారు. అయితే ఈసారి మాత్రం సరికొత్తగా షోను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
బిగ్‌బాస్ బజ్ అంటే..
అదేంటంటే.. బిగ్‌బాస్ ఆటను లైవ్‌గా సెట్‌లో చూసే అవకాశం కల్పించారు మేకర్స్. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది స్టార్ మా. ‘ఈసారి బిగ్‌బాస్ ఆట ఆ హౌజ్‌లో మాత్రమే కాదు. మీ హౌజ్‌లో కూడా. బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్స్‌ను సెట్‌లో కూర్చొని లైవ్‌గా చూడాలని అనుకుంటున్నారా? అయితే ప్రతిరోజు బిగ్‌బాస్ బజ్‌లో మేం అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పండి. ఫేస్‌బుక్ లైవ్‌లో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన లక్కీ విన్నర్స్ వీకెండ్ ఎపిసోడ్స్‌ను లైవ్‌గా చూడొచ్చు’ అని వీడియోలో చెప్పుకొచ్చారు మేకర్స్. కాగా బిగ్‌బాస్ షో ప్రారంభమైన మరుసటి రోజే బిగ్‌బాస్ బజ్ ప్రారంభమవుతుంది. అంటే సెప్టెంబర్ 4 నుంచి బిగ్ బాస్ బజ్ స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు ఉదయం 10, సాయంత్రం 6 గంటలకు స్టార్ మా మ్యూజిక్‍లో బిగ్ బాస్ బజ్ ప్రసారం కానుంది. బిగ్‌బాస్ షోలో చూపించని మరికొన్ని ఆసక్తికర విషయాలను బిగ్‌బాస్ బజ్‌లో రిలీజ్ చేస్తారు మేకర్స్. స్టార్ మా మ్యాజిక్‌లో ఈ షో టెలికాస్ట్ అవుతుంది.
మరికొన్ని గంటల్లో షో ప్రారంభం..
View this post on Instagram
బిగ్ బాస్ ఫ్యాన్స్ కు బంపరాఫర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.