Jailer Movie OTT: ఇట్స్ అఫీషియల్.. రజినీకాంత్ ‘జైలర్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే..
ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అటు చాలా కాలం తర్వాత రజినీకి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది జైలర్. ప్రస్తుతం జైలర్ థియేట్రికల్ రన్ కొనసాగిస్తుండగానే ఇటు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తోందా అంటూ నెట్టింట చర్చ మొదలైంది. రెండు రోజులుగా జైలర్ ఓటీటీ స్ట్రీమింగ్ పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజాగా జైలర్ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన వచ్చింది.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న సినిమా జైలర్. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ఇది. బీస్ట్ సినిమా తర్వాత ఫుల్ యాక్షన్ మోడ్లో రజినీతో ఈ చిత్రాన్ని రూపొందించి బాక్సాఫీస్‍ను షేక్ చేస్తున్నారు డైరెక్టర్ దిలీప్. ఆగస్ట్ 10న విడుదలైన ఈ సినిమా దూసుకుపోతుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అటు చాలా కాలం తర్వాత రజినీకి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది జైలర్. ప్రస్తుతం జైలర్ థియేట్రికల్ రన్ కొనసాగిస్తుండగానే ఇటు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తోందా అంటూ నెట్టింట చర్చ మొదలైంది. రెండు రోజులుగా జైలర్ ఓటీటీ స్ట్రీమింగ్ పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజాగా జైలర్ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన వచ్చింది.
ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని తెలియజేశారు మేకర్స్. ఫుల్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్, మోహల్ లాల్, తమన్నా, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషించారు.
Jailer’s in town, it’s time to activate vigilant mode! 🔒🚨#JailerOnPrime, Sept 7 pic.twitter.com/2zwoYR6MqV
— prime video IN (@PrimeVideoIN) September 2, 2023
ఈ సినిమా విడుదలకు ముందే ఇందులోని పాటలు యూట్యూబ్ లో సెన్సెషన్ అయ్యాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో తమన్నా చేసిన కావాలయ్యా పాట ఏ రెంజ్ లో ట్రెండ్ అయ్యిందో చెప్పక్కర్లేదు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా నెట్టింట ఈ పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
Mr. Kalanithi Maran met Superstar @rajinikanth and handed over a cheque, celebrating the historic success of #Jailer pic.twitter.com/Y1wp2ugbdi
— Sun Pictures (@sunpictures) August 31, 2023
ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడంతో నిర్మాత కళానిధి మారన్ ఫుల్ సంతోషంలో ఉన్నారు. ఇప్పటికే రజినీకి రెమ్యూనరేషన్ కాకుండా రూ.100 కోట్లు అదనంగా గిఫ్ట్ ఇచ్చారు కళానిధి. అలాగే ఖరీదైన బీఎండబ్ల్యూ కారు బహుమతిగా అందించారు. ఇక డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు కూడా లగ్జరీ బీఎండబ్ల్యూ అందించారు మారన్.
To celebrate the grand success of #Jailer, Mr.Kalanithi Maran presented the key of a brand new Porsche car to @Nelsondilpkumar #JailerSuccessCelebrations pic.twitter.com/kHTzEtnChr
— Sun Pictures (@sunpictures) September 1, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.