Pawan Kalyan: పవర్ స్టార్ బర్త్ డే స్పెషల్ గిఫ్ట్ వచ్చేసింది.. ‘హరి హర’ వీరమల్లు కొత్త పోస్టర్ చూశారా ?..

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో క్యూరియాసిటి నెలకొంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై మరింత హైప్ పెంచాయి. ఇక ఇప్పుడు పవన్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రయూనిట్ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ఆకట్టుకుంటుంది. పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ అర్ధరాత్రి 12.17 నిమిషాలకు కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.

Pawan Kalyan: పవర్ స్టార్ బర్త్ డే స్పెషల్ గిఫ్ట్ వచ్చేసింది.. 'హరి హర' వీరమల్లు కొత్త పోస్టర్ చూశారా ?..
Hari Hara Veera Mallu Movie
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 02, 2023 | 9:27 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలబ్రెషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఓవైపు సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమ ఫేవరెట్ హీరోకు బర్త్ డే విషెస్ తెలుపుతుండగా..మరోవైపు పవన్ కొత్త ప్రాజెక్ట్స్ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2న అర్దరాత్రి పవన్ న్యూలుక్ రివీల్ చేసి సర్ ప్రైజ్ చేసింది చిత్రయూనిట్ హరి హర వీరమల్లు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో క్యూరియాసిటి నెలకొంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై మరింత హైప్ పెంచాయి. ఇక ఇప్పుడు పవన్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రయూనిట్ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ఆకట్టుకుంటుంది. పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ అర్ధరాత్రి 12.17 నిమిషాలకు కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.

“ఈ సంతోషకరమైన రోజున మన హరి హర వీరమల్లు అసాధారణ ధైర్యసాహసాలు, దయ, అపరితమితమైన కరుణను జరుపుకుంటున్నాము” అంటూ రాసుకొచ్చారు. ఇక కొత్తగా విడుదలైన పోస్టర్ లో పవన్ ఒక యోధుడిగా కనిపిస్తున్నారు. సీరియస్ లుక్ లో పవన్ నడిస్తోన్న పిక్ ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే ఇది సినిమాలోని ఫైట్ సీన్ అని తెలుస్తోంది. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీలకు సంబంధించిన చారిత్రక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ పీరియాడిక్ మూవీలో పవన్ జోడిగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. అలాగే ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. దాదాపు రూ.150 కోట్లతో నిర్మిస్తోన్న ఈ మూవీలో నర్గిస్ ఫక్రి, పూజిత పొన్నాడ, విక్రమజీత్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు మెగా అభిమానులు. పవన్ కెరీర్ లోనే హై బడ్జెట్ ఫిల్మ్ ఇది. దీంతో ఈ సినిమాపై పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. ఎప్పటినుంచంటే..?
తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. ఎప్పటినుంచంటే..?
అందంలో సునీతానే డామినేట్ చేస్తున్న ఆమె కూతురి లేటెస్ట్ లుక్
అందంలో సునీతానే డామినేట్ చేస్తున్న ఆమె కూతురి లేటెస్ట్ లుక్
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
కలలో కారు కనిపించిందా.? మీ జీవితంలో ఈ మార్పు జరగబోతున్నట్లే
కలలో కారు కనిపించిందా.? మీ జీవితంలో ఈ మార్పు జరగబోతున్నట్లే
ఓ పక్క దీక్ష.. మరో పక్క పని.! దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్..
ఓ పక్క దీక్ష.. మరో పక్క పని.! దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్..
ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? చెడు కొలెస్ట్రాల్‌కు సంకేతాలు
ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? చెడు కొలెస్ట్రాల్‌కు సంకేతాలు
Employment crisis in USA: అమెరికాలో ఐటీ ఉద్యోగులకు భయం భయం!
Employment crisis in USA: అమెరికాలో ఐటీ ఉద్యోగులకు భయం భయం!
'నిరుద్యోగ యువత పక్షాన అసెంబ్లీని స్తంభింపజేస్తాం'.. మాజీ మంత్రి
'నిరుద్యోగ యువత పక్షాన అసెంబ్లీని స్తంభింపజేస్తాం'.. మాజీ మంత్రి
రేపట్నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షురూ.. జులై 19 నుంచి తరగతులు
రేపట్నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షురూ.. జులై 19 నుంచి తరగతులు
అలర్ట్‌.. ఈ రోజే చివరి గడువు.. ఈ పని చేయకుంటే అకౌంట్‌ నిలిపివేత
అలర్ట్‌.. ఈ రోజే చివరి గడువు.. ఈ పని చేయకుంటే అకౌంట్‌ నిలిపివేత