AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాతకం మారిపోతుందంటే ఇంట్లో ఉన్నదంతా తెచ్చి ఇచ్చాడు.. చివరకు జరిగింది తెలిస్తే నోరెళ్లబెడతారు..

అతడొక విద్యావంతుడు.. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఆదాయపు పన్ను శాఖలో బాధ్యతాయుతమైన అధికారి. కానీ గ్రహాల గతి మారుతుందన్న చిలుక జోస్యం మాటలు నమ్మి నిలువునా మునిగిపోయారు. ట్రాన్స్ అవుతుందనే ఆశతో, జాతకం చెప్పే వ్యక్తి అడిగిందే తడవుగా ఇంట్లోని కిలోల కొద్దీ వెండిని, తులాల కొద్దీ బంగారాన్ని అతనికి అప్పగించారు.

జాతకం మారిపోతుందంటే ఇంట్లో ఉన్నదంతా తెచ్చి ఇచ్చాడు.. చివరకు జరిగింది తెలిస్తే నోరెళ్లబెడతారు..
Astrologer Arrested For Cheating Income Tax Officer
Krishna S
|

Updated on: Mar 15, 2026 | 9:01 PM

Share

జాతకాలు, చిలుక జోస్యాలను గుడ్డిగా నమ్మితే ఎంతటి విద్యావంతులైనా ఎలా మోసపోతారో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. ట్రాన్స్‌ఫర్ అవుతుందనే ఆశతో ఒక ఐటీ శాఖ అధికారి, చిలుక జోస్యం చెప్పే వ్యక్తిని నమ్మి ఏకంగా రూ.35 లక్షల విలువైన ఆభరణాలను పోగొట్టుకున్నారు. ఈ విస్తుపోయే ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారి, గత డిసెంబర్‌లో భారతీనగర్‌లోని శ్రీ సర్కిల్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా శేఖర్ అనే చిలుక జోస్యం చెప్పే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ అధికారికి తన మాటలతో మాయ చేసిన శేఖర్.. నీ జాతకం చాలా బాగుందని, అయితే కొన్ని దోషాలు ఉన్నాయని నమ్మించాడు.

దశలవారీగా దోపిడీ..

జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే ప్రత్యేక పూజలు చేయాలని శేఖర్ సూచించాడు. దీనికోసం మొదట రూ.50 వేలు వసూలు చేశాడు. ఆ తర్వాత కూడా రకరకాల కారణాలతో పదే పదే ఫోన్ చేస్తూ అధికారి నుండి డబ్బులు లాగుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తనకు కావలసిన ప్రాంతానికి బదిలీ ఎప్పుడు అవుతుందని ఆ అధికారి శేఖర్‌ను అడిగారు.

బదిలీ ఆశ చూపి.. బంగారం మాయం

బదిలీ కావాలంటే ఒక పెద్ద పూజ చేయాలని, అందుకు ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలన్నీ తీసుకురావాలని శేఖర్ నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన అధికారి.. సుమారు 194 గ్రాముల బంగారు ఆభరణాలు, 1 కిలో 300 గ్రాముల వెండిని (మొత్తం విలువ రూ. 35 లక్షలు) శేఖర్‌కు అప్పగించారు. పూజ పూర్తికాగానే ఒక రోజులోనే తిరిగి ఇచ్చేస్తానని శేఖర్ హామీ ఇచ్చాడు.

వారమయ్యాక అసలు రంగు బయటపడింది..

వారం రోజుల పాటు పూజ ఇంకా పూర్తి కాలేదు అని కాలయాపన చేసిన శేఖర్, ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. అనుమానం వచ్చిన అధికారి భారతీనగర్‌లోని అతను జోస్యం చెప్పే ప్రాంతానికి వెళ్లి చూడగా.. అక్కడ శేఖర్ గానీ, అతని చిలుక గానీ లేవు. తానే మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే భారతీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని తమిళనాడులో అరెస్ట్ చేశారు. ఇంకా ఎవరినైనా మోసం చేశాడా అనే కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా విద్యావంతులైన అధికారులు కూడా ఇలాంటి మూఢనమ్మకాలతో మోసపోవడం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది.

Follow Us
జాతకం మారిపోతుందంటే ఇంట్లో ఉన్నదంతా తెచ్చి ఇచ్చాడు.. చివరకు..
జాతకం మారిపోతుందంటే ఇంట్లో ఉన్నదంతా తెచ్చి ఇచ్చాడు.. చివరకు..
రష్మిక మాస్ వార్నింగ్.. అలాంటి తప్పులు చేస్తే కట్టిన చర్యలు తప్ప
రష్మిక మాస్ వార్నింగ్.. అలాంటి తప్పులు చేస్తే కట్టిన చర్యలు తప్ప
థియేటర్స్‌లో ఎక్కలేదు.. ఓటీటీలో తెగ చూసేస్తున్నారు..
థియేటర్స్‌లో ఎక్కలేదు.. ఓటీటీలో తెగ చూసేస్తున్నారు..
పీక్స్‌కు చేరిన ఉస్తాద్ మ్యానియా!
పీక్స్‌కు చేరిన ఉస్తాద్ మ్యానియా!
దండయాత్రకు రెడీ అవుతున్న కుర్ర హీరోలు.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే
దండయాత్రకు రెడీ అవుతున్న కుర్ర హీరోలు.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే
అందంలో ఐశ్వర్యరాయ్‌తో పోటీపడుతున్న కుర్రభామ.. ఎవరో గుర్తుపట్టారా?
అందంలో ఐశ్వర్యరాయ్‌తో పోటీపడుతున్న కుర్రభామ.. ఎవరో గుర్తుపట్టారా?
దోషాలను తొలగించి శుభాలు అందించే శక్తివంతమైన మార్గం.. ప్రదోష పూజ..
దోషాలను తొలగించి శుభాలు అందించే శక్తివంతమైన మార్గం.. ప్రదోష పూజ..
కండలు పెంచుతున్న టాలీవుడ్ స్టార్స్‌..
కండలు పెంచుతున్న టాలీవుడ్ స్టార్స్‌..
బాక్సాఫీస్‌కు కొత్త పాఠాలు నేర్పిస్తున్న ధురంధర్‌
బాక్సాఫీస్‌కు కొత్త పాఠాలు నేర్పిస్తున్న ధురంధర్‌
ఈ సినిమాల్లో ఆస్కార్‌కు వెళ్ళేది ఎవరు ?? అందరు చూపు ఆ సినిమా వైపే
ఈ సినిమాల్లో ఆస్కార్‌కు వెళ్ళేది ఎవరు ?? అందరు చూపు ఆ సినిమా వైపే