AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లిలో తింటుండగా గొంతులో ఇరుక్కున్న రసగుల్ల.. ఆ తర్వాత ఏం జరిగిందో అస్సలు ఊహించలేరు..

ఓ వైపు పెళ్లిలో బంధుమిత్రుల సందడి.. మరోవైపు విందు భోజనాల ఘుమఘుమలు. అందరిలాగే ఆ వ్యక్తి కూడా ఇష్టమైన మిఠాయిని ఆస్వాదించాలనుకున్నాడు. కానీ ఆ రసగుల్లానే అతడి పాలిట యముడవుతుందని ఎవరూ ఊహించలేదు. ఒకే ఒక్క స్వీటు.. ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలితీసుకుంది? అసలు ఏం జరిగింది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

పెళ్లిలో తింటుండగా గొంతులో ఇరుక్కున్న రసగుల్ల.. ఆ తర్వాత ఏం జరిగిందో అస్సలు ఊహించలేరు..
Man Dies Eating Rasgulla In Jamshedpur
Krishna S
|

Updated on: Mar 15, 2026 | 9:18 PM

Share

పెళ్లి వేడుక అంటేనే బంధుమిత్రుల సందడి, రుచికరమైన విందు భోజనాలు. కానీ ఆ సంతోషం నిమిషాల్లోనే విషాదంగా మారింది. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగిన ఒక వివాహ వేడుకలో రసగుల్లా తింటూ ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. చిన్న నిర్లక్ష్యం లేదా అజాగ్రత్త ప్రాణాల మీదకు ఎలా వస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. మాలియాంట గ్రామానికి చెందిన లలిత్ సింగ్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో భోజనం చేస్తూ ఒక రసగుల్లాను తిన్నారు. అయితే అది అనుకోకుండా అతని గొంతులో ఇరుక్కుపోయింది. వెంటనే లలిత్‌కు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. అక్కడున్న వారు రసగుల్లాను బయటకు తీయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో వెంటనే MGM ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యలోనే లలిత్ ప్రాణాలు విడిచారు.

వైద్యులు ఏం చెబుతున్నారు?

ఆహారం గొంతులో ఇరుక్కుని మరణించడానికి గల కారణాలను డాక్టర్ రోహిత్ ఝా వివరించారు. మన గొంతులో ఎపిగ్లోటిస్ అనే ఒక చిన్న గ్రంథి ఉంటుంది. మనం ఆహారం మింగేటప్పుడు ఇది వాయునాళాన్ని మూసివేసి, ఆహారం కేవలం ఆహారనాళంలోకి వెళ్లేలా చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎపిగ్లోటిస్ సరిగ్గా స్పందించదని చెప్పారు.

మాట్లాడుతూ తినడం: భోజనం చేసేటప్పుడు బిగ్గరగా మాట్లాడినా లేదా నవ్వినా ఎపిగ్లోటిస్ తెరుచుకుంటుంది. అప్పుడు ఆహార పదార్థాలు వాయునాళంలోకి వెళ్లి ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటాయి.

మద్యం మత్తు: వ్యక్తి మద్యం మత్తులో ఉన్నప్పుడు మెదడు స్పందనలు నెమ్మదించి. ఈ గ్రంథి పనితీరు మందగిస్తుంది.

త్వరత్వరగా మింగడం: పెద్ద ముక్కలను నమలకుండా ఒకేసారి మింగడానికి ప్రయత్నించడం వల్ల అవి గొంతులో ఇరుక్కుపోయి ఊపిరి ఆడకుండా చేస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మౌనంగా తినండి: భోజనం చేసేటప్పుడు వీలైనంత వరకు మాట్లాడకుండా ఉండటం శ్రేయస్కరం.

నిశ్శబ్దంగా నమలండి: ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని, బాగా నమిలి మింగాలి.

ప్రశాంతత: కంగారుగా లేదా నవ్వుతూ ఆహారం తీసుకోకండి.

మత్తులో ఉన్నప్పుడు: మద్యం మత్తులో ఉన్నప్పుడు భారీ భోజనం లేదా పెద్ద సైజు మిఠాయిలను తినకపోవడమే మంచిది.

Follow Us