- Telugu News Photo Gallery Cinema photos Ee Rojullo Movie Actress Reshma Rathore Is Now A Supreme Court Lawyer, Know full details here
సుప్రీంకోర్టులో లాయర్‌గా పనిచేస్తోన్న తెలుగు హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ అదృష్టం పరీక్షించుకోవడానికి ఏటా ఎందరో నటీనటులు కొత్తగా ఎంట్రీ ఇస్తుంటారు. కొందరికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొందరు కనుమరుగైపోతారు. అలాంటి ఓ తెలుగు హీరోయిన్ గురించే ఇప్పుడు మనం చర్చిస్తోంది. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చి అనతి కాలంలోనే భారీగానే ఆఫర్లు దక్కించుకున్న బ్యూటీ రేష్మా రాథోడ్. తొలినాళ్లలో వరుస అవకాశాలు తలుపు తట్టినా..
Updated on: Sep 02, 2023 | 7:44 AM

సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ అదృష్టం పరీక్షించుకోవడానికి ఏటా ఎందరో నటీనటులు కొత్తగా ఎంట్రీ ఇస్తుంటారు. కొందరికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొందరు కనుమరుగైపోతారు. అలాంటి ఓ తెలుగు హీరోయిన్ గురించే ఇప్పుడు మనం చర్చిస్తోంది. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చి అనతి కాలంలోనే భారీగానే ఆఫర్లు దక్కించుకున్న బ్యూటీ రేష్మా రాథోడ్. తొలినాళ్లలో వరుస అవకాశాలు తలుపు తట్టినా ఆ తర్వాత ఎందుకో అంతగా కలిసి రాలేదు.

వెంకటేశ్, త్రిష జంటగా నటించిన బాడీగార్డ్ మువీలో ఆమెకు ఫ్రెండ్‌గా నటించింది కెరీర్ స్టార్ట్ చేసింది ఈ భామ. అదే ఏడాది‘ఈ రోజుల్లో..’ అనే మువీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. విచిత్రంగా ఆ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

ఇలా జై శ్రీరామ్, లవ్ సైకిల్, ప్రతిఘటన, జీలకర్ర బెల్లం, అప్పవుమ్ వీంజుమ్ అనే మలయాళ మువీ, అదగపట్టత్తు మగజననంగలయ్ తమిళ మువీతోపాటు పలు సినిమాల్లో నటించింది.

కానీ ఇవేవీ పెద్దగా కలిసిరాకపోవడంతో 2017 తర్వాత నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బీజేపీ పార్టీలో చేరి చురుగా రాజకీయాల్లో పాల్గొంది. అదే సమయంలో లా కోర్సు కూడా చదివేసింది. దీంతో ఇటీవల ఏకంగా సుప్రీంకోర్టు లాయర్‌గా ఎంపికైంది. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి రాజకీయ నేతగా ఎదిగా లాయర్‌గా స్థిరపడింది రేష్మా రాథోడ్.

ఎంతైనా ఓ తెలుగు హీరోయిన్ సుప్రీం కోర్టు లాయర్ కావడమంటే అది పెద్ద విషయమే కదా..! లాయర్‌గా రేష్మా రాథోడ్ ను చూపిన అభిమానులు అస్సలు గుర్తుపట్టలేకపోతున్నారు. ఎంత మారిపోయింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.





























