Ananya Nagalla: నవ్వులు రువ్వుతున్న నెరజాణ.. ఈ అమ్మడికి అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో..
మల్లేశం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ. తొలి సినిమాతోనే తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ క్రేజ్ తోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం అందుకుంది ఈ చిన్నది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ లో నటించింది అనన్య. ఈ మూవీలో దివ్య నాయక్ అనే గిరిజన యువతిగా కనిపించింది. ఈ మూవీతో అనన్యకు మంచి గుర్తింపు వచింది . కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి.