Pawan Kalyan Birthday: పవన్‏కు ఇష్టమైన సాంగ్ అదే.. ఆ పాట చూడడం కోసం రాత్రంతా బయటే కూర్చొన్న పవర్ స్టార్..

సోషల్ మీడియా వేదికగా పవన్‏కు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఆయనకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్, అరుదైన పిక్చర్స్ నెట్టింట పంచుకుంటున్నారు అభిమానులు, సినీతారలు. మరోవైపు పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఆయన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆయన నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమా నుంచి పవన్ న్యూలుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

Pawan Kalyan Birthday: పవన్‏కు ఇష్టమైన సాంగ్ అదే.. ఆ పాట చూడడం కోసం రాత్రంతా బయటే కూర్చొన్న పవర్ స్టార్..
Pawan Kalyan
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Sep 02, 2023 | 9:28 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు (సెప్టెంబర్ 2). ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పవన్ పుట్టిన రోజు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా పవన్‏కు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఆయనకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్, అరుదైన పిక్చర్స్ నెట్టింట పంచుకుంటున్నారు అభిమానులు, సినీతారలు. మరోవైపు పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఆయన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆయన నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమా నుంచి పవన్ న్యూలుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అయితే పోస్టర్స్ కాదు.. గ్లింప్స్ కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటివరకు పవన్ నటించిన చిత్రాల్లో ఆయనకు ఎంతో ఇష్టమైన సాంగ్ తొలి ప్రేమ చిత్రంలోని ‘ఈ మనస్సే..’ పాట. ఈ సాంగ్ చూడడం కోసం రాత్రి 2 గంటల వరకు బయట కూర్చున్నారట పవన్. ఇంతకీ అసలు విషయం ఏంటో తెలుసుకుందామా.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమా తొలిప్రేమ. ఈ మూవీ తర్వాత పవన్ క్రేజీ మరింత పెరిగిపోయింది. ఈ చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహించగా.. అప్పట1998 జూలై 24న విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఇందులో కీర్తి రెడ్డి కథానాయికగా నటించింది. పవన్ కు ఈ మూవీ స్టోరీ చెప్పేందుకు దాదాపు ఏడు నెలలు వెయిట్ చేశారట డైరెక్టర్ కరుణాకరన్. ఈ సినిమా స్టోరీ వినగానే ఓకే చేశారట పవన్.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Pawan Kalyan (@pawankalyan)

ఇదిలా ఉంటే… ఇక షూటింగ్ అంతా పూర్తయ్యాక ఎడిటింగ్ పనులు రామానాయుడు స్టూడియో జరిగాయట. ఈ మనస్సే సాంగ్ అంటే పవన్ కు చాలా ఇష్టమని గతంలో డైరెక్టర్ కరుణాకరన్ తెలిపారు. ఓ రోజు ఈ మనస్సే సాంగ్ ఎడిట్ చేస్తున్న సమయంలో రాత్రి 8 గంటలకు పవన్ స్టూడియోకు వచ్చి కరుణ.. ఆ పాట ఒకసారి చూపిస్తావా అని అడిగారట. ఎడిట్ జరుగుతుందని.. కాసేపు వెయిట్ చేయాలని దర్శకుడు కోరారట. ఇక ఆ సాంగ్ మార్పులు చేర్పులు చేసి అనుకున్న విధంగా సన్నివేశాలను ఎడిట్ చేసి పాట మొత్తం పూర్తి చేసేసరికి రాత్రి 2 గంటలు దాటిపోయింది. అప్పటికి బయటకు వెళ్లగా.. అక్కడే బల్లపై కూర్చుని కనిపించారట పవన్. సాంగ్ చూసేందుకు రాత్రంతా బయటే కూర్చుని వెయిట్ చేసి చివరకు సాంగ్ చూసి దర్శకుడిని హత్తుకుని బాగా చేశావ్ అని మెచ్చుకున్నారని గతంలో డైరెక్టర్ తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే