AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అభిమానులకు కిక్కిచ్చే వీడియో షేర్ చేసిన అల్లు అర్జున్.. పుష్ప 2 షూటింగ్ లొకేషన్ చూపిస్తూ..

మార్నింగ్ తన డే స్టార్ట్ చేయడం దగ్గర్నుంచి.. సాయంత్రం వరకు ఏమేం చేస్తారనే చూపించారు. ముందుగా ఇంట్లోని గార్డెన్ లో యోగ చేయడం.. ఆ తర్వాత ఉదయం రోజు తన పిల్లలతో వీడియో కాల్ మాట్లాడటం.. అక్కడి నుంచి పుష్ప సెట్ కు వెళ్లడం.. షూటింగ్‏లో పాల్గొనడం అన్ని విషయాలను చూపించారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Allu Arjun: అభిమానులకు కిక్కిచ్చే వీడియో షేర్ చేసిన అల్లు అర్జున్.. పుష్ప 2 షూటింగ్ లొకేషన్ చూపిస్తూ..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Aug 30, 2023 | 11:13 AM

Share

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే పుష్ప చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనకు సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. బన్నీ ప్రతి మూమెంట్ తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే మంగళవారం తన ఇన్ స్టా స్టోరీలో సంథింగ్ స్పెషల్ ఉండనుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో బన్నీ చెప్పబోయే స్పెషల్ న్యూస్ ఏంటీ అని తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బన్నీ తన ఇన్ స్టాలో ఓ వీడియో షేర్ చేశారు. అందులో తను ఒక రోజులో ఏం చేస్తారనే చూపించారు.

ఆ వీడియోలో అల్లు అర్జున్ హోం టూర్ చేశారు. మార్నింగ్ తన డే స్టార్ట్ చేయడం దగ్గర్నుంచి.. సాయంత్రం వరకు ఏమేం చేస్తారనే చూపించారు. ముందుగా ఇంట్లోని గార్డెన్ లో యోగ చేయడం.. ఆ తర్వాత ఉదయం రోజు తన పిల్లలతో వీడియో కాల్ మాట్లాడటం.. అక్కడి నుంచి పుష్ప సెట్ కు వెళ్లడం.. షూటింగ్‏లో పాల్గొనడం అన్ని విషయాలను చూపించారు. అలాగే ఆ వీడియోలో పుష్ప షూటింగ్ సెట్ లొకేషన్స్, హీరో క్యాస్టూమ్స్, కేరవాన్, ప్రాపర్టీస్ అన్నింటిని చూపిస్తూ.. డైరెక్టర్ సుకుమార్ తో తనకు 20 ఏళ్ల బంధం అని.. ఇది తనకు 20 సినిమా అని బన్నీ తెలిపారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Instagram (@instagram)

ఇదిలా ఉంటే.. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇందులో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించింది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఇక ఇటీవల ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో ఈ సినిమాగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవీ శ్రీ ప్రసాద్ అవార్డ్స్ అందుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఇదే
బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఇదే
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
సొంతగడ్డపై గైక్వాడ్ దూకుడు.. ముంబైను చిత్తు చేసిన చెన్నై
సొంతగడ్డపై గైక్వాడ్ దూకుడు.. ముంబైను చిత్తు చేసిన చెన్నై
బరువు తగ్గిన తర్వాత చర్మాన్ని టైట్ చేసే అద్భుత పరిష్కారాలు!
బరువు తగ్గిన తర్వాత చర్మాన్ని టైట్ చేసే అద్భుత పరిష్కారాలు!
ఈసీ కీలక నిర్ణయం.. బెంగాల్‌లోని ఫాల్టా నియోజకవర్గంలో రీపోలింగ్‌
ఈసీ కీలక నిర్ణయం.. బెంగాల్‌లోని ఫాల్టా నియోజకవర్గంలో రీపోలింగ్‌
మరణం తర్వాత డిజిటల్ సంపదను కాపాడే ‘డిజిటల్ విల్
మరణం తర్వాత డిజిటల్ సంపదను కాపాడే ‘డిజిటల్ విల్
వారెవ్వా.. సొంత స్థలంలో నరసింహ స్వామి గుడి కట్టిన ముస్లిం వ్యక్తి
వారెవ్వా.. సొంత స్థలంలో నరసింహ స్వామి గుడి కట్టిన ముస్లిం వ్యక్తి