Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 60 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడే.. ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుపట్టగలరా ?..

ఎన్నో విమర్శలు ఎదుర్కొని హీరోగా ప్రశంసలు అందుకున్నారు. ప్రేమకథా చిత్రాలు.. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, హర్రర్ థ్రిల్లర్ మూవీస్ తోపాటు.. భక్తిరస చిత్రాలకు ఆయనే కేరాఫ్ అడ్రస్. ఎవరో గుర్తుపట్టగలరా ?.. 60 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ ఇప్పుడున్న యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఇండస్ట్రీలో సైలెంట్ అయిన ఈ హీరో ఇప్పుడు రీఎంట్రీతో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు.

Tollywood: 60 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడే.. ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుపట్టగలరా ?..
Tollywood Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 27, 2023 | 9:53 AM

పైన కనిపిస్తోన్న ఫోటోలో టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నారు గుర్తుపట్టగలరా ?.. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న అగ్రకథానాయకులలో ఆయన ఒకరు. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి హీరోగా వెండితెరకు పరిచయమైనా.. తన నటనతో ఎన్నో విమర్శలు ఎదుర్కొని హీరోగా ప్రశంసలు అందుకున్నారు. ప్రేమకథా చిత్రాలు.. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, హర్రర్ థ్రిల్లర్ మూవీస్ తోపాటు.. భక్తిరస చిత్రాలకు ఆయనే కేరాఫ్ అడ్రస్. ఎవరో గుర్తుపట్టగలరా ?.. 60 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ ఇప్పుడున్న యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఇండస్ట్రీలో సైలెంట్ అయిన ఈ హీరో ఇప్పుడు రీఎంట్రీతో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. అతనే టాలీవుడ్ నవ మన్మథుడు అక్కినేని నాగార్జున.

టాలీవుడ్ దివంగత సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వర్ రావు తనయుడు నాగార్జున. 1986లో విక్రమ్ సినిమాతో తెలుగు తెరకు నటుడిగా పరిచయమయ్యారు నాగ్. ఆ తర్వాత ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే నాగార్జున కెరీర్ లో వచ్చిన గీతాంజలి, శివ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. అప్పట్లో ఈ సినిమాలు యూత్ ను తెగ ఆకట్టుకున్నాయి.కేవలం ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మాత్రమే కాకుండా భక్తిరస చిత్రాల్లోనూ మెప్పించారు.

అన్నమయ్య, శ్రీరామదాసు, శిర్డీ సాయి చిత్రాల్లో నటించి అలరించారు. చాలా కాలంగా నాగ్ ఖాతాలో సరైన హిట్టు పడలేదు. ఇటీవల విడుదలైన ఘోస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న నాగ్..ఇప్పుడు సరికొత్త ప్రాజెక్టుతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు.

మరోవైపు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 7 హోస్టింగ్ కూడా చేయనున్నారు. ఇప్పటివరకు సీజన్ 3 నుంచి హోస్టింగ్ చేస్తున్న నాగ్.. ఇప్పుడు సీజన్ 7 కూడా చేయబోతున్నట్లు మేకర్స్ ఇదివరకే అనౌన్స్ చేశారు. అటు ఎప్పటికప్పుడు ప్రోమోస్ రిలీజ్ చేస్తూ ఈసారి సీజన్ 7 మరింత ఆసక్తికరంగా ఉండబోతుందని చెబుతున్నారు నాగ్. ఈ క్రమంలోనే ప్రస్తుతం నాగార్జునకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోస్ కూడా నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మూడో ప్రపంచం ముంగిట ప్రపంచం..ఆందోళన కలిగిస్తున్న సలోమ్ జ్యోస్యం
మూడో ప్రపంచం ముంగిట ప్రపంచం..ఆందోళన కలిగిస్తున్న సలోమ్ జ్యోస్యం
IPL History: డెబ్యూ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన ఆటగాళ్లు వీరే..
IPL History: డెబ్యూ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన ఆటగాళ్లు వీరే..
మే 1 నుంచి మారనున్న ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే
మే 1 నుంచి మారనున్న ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే
వినియోగదారులకు అలర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి రానున్న మార్పులివే !
వినియోగదారులకు అలర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి రానున్న మార్పులివే !
ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోండి.. గూగుల్ హెచ్చరిక!
ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోండి.. గూగుల్ హెచ్చరిక!
పెంపుడు జంతువుల విషయంలో ఈ తప్పులు చేయకండి..?
పెంపుడు జంతువుల విషయంలో ఈ తప్పులు చేయకండి..?
మనసు దోచుకుంటున్న పిల్లిపిల్లకు కుక్క సాయం వీడియోపై ఓ లుక్ వేయండి
మనసు దోచుకుంటున్న పిల్లిపిల్లకు కుక్క సాయం వీడియోపై ఓ లుక్ వేయండి
ఈ అంకుల్ సైక్లింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఈ అంకుల్ సైక్లింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఇక్కడ తొలిసారిగా వందేభారత్‌.. 38 సొరంగాలు.. 927 వంతెనలు దాటుకుంటూ
ఇక్కడ తొలిసారిగా వందేభారత్‌.. 38 సొరంగాలు.. 927 వంతెనలు దాటుకుంటూ
అర్ధరాత్రి మిస్టరీ మహిళ.. డోర్‌బెల్స్‌ మోగిస్తుండటంతో జనంలో భయం
అర్ధరాత్రి మిస్టరీ మహిళ.. డోర్‌బెల్స్‌ మోగిస్తుండటంతో జనంలో భయం