Rakul Preet Singh: చీరకట్టులో అందంగా మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్.. ఈ రాఖీ పౌర్ణమికి శారీ ఐడియాస్..

ఇప్పటికే ఫెస్టివల్స్ కు లెహంగాలు, రెడ్ కార్పెట్ ఈవెంట్స్ కోసం అందమైన కాక్ టెయిల్ గౌన్స్, సినిమా ప్రమోషన్స్ కోసం చిక్ స్ట్రీట్ స్టైల్ ఫ్యాషన్ లో కనిపిస్తూ అభిమానులను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది రకుల్. ఇంతకు ముందు రా మ్యాంగో చీరలో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. అలాగే పుచ్ సియా పింక్ లో.. బంగరాు జరీ అంచులు కలిగిన చీరలో అందంగా మెరిసింది. ఈ రాఖీ పండగ కోసం ఫ్యాషన్ ఐకాన్ రకుల్ ధరించిన చీరల కలెక్షన్స్ పై ఓ లుక్కెయ్యండి.

Rakul Preet Singh: చీరకట్టులో అందంగా మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్.. ఈ రాఖీ పౌర్ణమికి శారీ ఐడియాస్..
Rakul Preet Singh
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 27, 2023 | 8:58 AM

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది రకుల్. కానీ కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది రకుల్. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ రకుల్ కు సరైన అవకాశాలు రావడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఇటీవల కొంతకాలంగా తన ఇన్ స్టా ఖాతాలో క్రేజీ పిక్స్ షేర్ చేస్తుంది రకుల్. ఈ క్రమంలోనే తాజాగా పింక్ శారీలో అందమైన ఫోటోస్ పంచుకుంది రకుల్. ఇప్పటికే ఫెస్టివల్స్ కు లెహంగాలు, రెడ్ కార్పెట్ ఈవెంట్స్ కోసం అందమైన కాక్ టెయిల్ గౌన్స్, సినిమా ప్రమోషన్స్ కోసం చిక్ స్ట్రీట్ స్టైల్ ఫ్యాషన్ లో కనిపిస్తూ అభిమానులను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది రకుల్. ఇంతకు ముందు రా మ్యాంగో చీరలో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. అలాగే పుచ్ సియా పింక్ లో.. బంగరాు జరీ అంచులు కలిగిన చీరలో అందంగా మెరిసింది. ఈ రాఖీ పండగ కోసం ఫ్యాషన్ ఐకాన్ రకుల్ ధరించిన చీరల కలెక్షన్స్ పై ఓ లుక్కెయ్యండి.

చీరకట్టులో రకుల్ మరింత అందంగా కనిపిస్తుంది. ప్రముఖ డిజైనర్ వీరాలి రవేషియా డిజైన్ చేసిన ఎరుపు రంగు చీరను ధరించింది రకుల్. ఎంబ్రాయిడరీతో కూడిన షీర్ ఫ్యాబ్రిక్ సాంప్రదాయ డ్రెస్సింగ్ కు చిక్ టచ్ జత చేసింది. స్ట్రాప్, అలకరించిన బ్లౌజ్ తో నెక్ లైన్ కలిగి ఉంది.ఈ ఎరుపు రంగు చీరలో పూర్తిగా ట్రెడిషనల్ టచ్ ఇచ్చింది రకుల్.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

అలాగే వైట్ అండ్ వైట్ శారీలో జాబిలమ్మగా కనువిందు చేసింది రకుల్. పలుచని చీరలో మిర్రర్స్ పొదిగిన లేటేస్ట్ ట్రెండీ చీరలో కనువిందు చేసింది రకుల్. ఈ చీరను ప్రముఖ డిజైనర్ అభినవ్ మిశ్రా డిజైన్ చేశారు.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

రకుల్ ప్రీత్ సింగ్ సన్ షైన్ ఎల్లో చీర ధరించి పండుగ కల నిజం చేసింది. క్రిషా సన్నీ రమణి బ్రాండ్ నుంచి పసుపు రంగు చీరను ధరించి అందంగా కనిపించింది. షీర్ చీరలో సిల్వర్ సీక్వెన్స్ చారలు కనిపించాయి. ఈ చీరకు మ్యాచింగ్ గా ఆమె సిల్వర్ నెక్లెస్, సిల్వర్ బ్యాంగిల్స్ స్టాక్ ధరించింది. ఈ చీరకట్టులో రకుల్ మరింత అందంగా కనిపించి మెరిసింది.

అలాగే పింక్ అండ్ రెడ్ షెడ్స్ కలిగిన అందమైన చీరలో సాంప్రదాయ లుక్ లో కనిపించింది రకుల్. ఎంబ్రాయిడరీ అంచులు కలిగిన ఈ చీరలో ముస్తాబయిన రకుల్.. సిల్వర్ చెవి పోగులు, సిల్వర్ బ్యాంగిల్స్ ధరించి క్లాసిక్ లుక్ లో మైమరపించింది.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.