Allu Arjun: మేనత్తను చూసి పరిగెత్తుకెళ్లి హత్తుకున్న అల్లు అర్జున్.. మేనల్లుడిని ముద్దాడిన సురేఖ కొణిదెల..

జూనియర్ ఎన్టీఆర్ సహా అంతా సోషల్ మీడియా వేదికగా బన్నీకి శుభాకాంక్షలు తెలుపగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఒకరోజు ఆలస్యంగా విష్ చేశారు. ఇక బన్నీ కూడా థాంక్యూ అంటూ సింపుల్ గా రిప్లై ఇచ్చారు. ఇంకేముంది మరోసారి మెగా, అల్లు కుటుంబాలు దూరంగా ఉంటున్నాయనే రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Allu Arjun: మేనత్తను చూసి పరిగెత్తుకెళ్లి హత్తుకున్న అల్లు అర్జున్.. మేనల్లుడిని ముద్దాడిన సురేఖ కొణిదెల..
Allu Arjun, Megastar Chiran
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 27, 2023 | 7:09 AM

గత 69 ఏళ్ల జాతీయ చలనచిత్ర పురస్కారాల చరిత్రలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ తెలుగు నటుడికి దక్కిన గౌరవం బన్నీకి చేరింది. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన పుష్ప సినిమాగానూ ఆయనకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సంబరాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినీపరిశ్రమలోని హీరోస్ అంతా బన్నీకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక బన్నీని చూస్తే గర్వంగా ఉందంటూ తన మనసులోని సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు చిరు. మరోవైపు మెగా హీరోస్, సినీ ప్రముఖులు బన్నీ ఇంటికి వెళ్లి మరీ ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఇక శనివారం బన్నీ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా బన్నీకి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు చిరు దంపతులు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

అయితే జూనియర్ ఎన్టీఆర్ సహా అంతా సోషల్ మీడియా వేదికగా బన్నీకి శుభాకాంక్షలు తెలుపగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఒకరోజు ఆలస్యంగా విష్ చేశారు. ఇక బన్నీ కూడా థాంక్యూ అంటూ సింపుల్ గా రిప్లై ఇచ్చారు. ఇంకేముంది మరోసారి మెగా, అల్లు కుటుంబాలు దూరంగా ఉంటున్నాయనే రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి బన్నీకి అపురూపమైన అభినందనలు అందాయి. ఇక బన్నీ మేనత్త మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ… అవార్డ్స్ ప్రకటించగానే వెంటనే అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిపోయారు. మేనత్తను చూడగానే బన్నీ పరుగున వెళ్లి హత్తుకున్నారు. ఇక బన్నీని ఆప్యాయంగా హత్తుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు.

ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న వీడియోలో సురేఖతోపాటు బన్నీ, ఆయన కుటుంబసభ్యులు ఎంతో సంతోషంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఇప్పుడు వీడియో నెట్టింట వైరలవుతుండగా.. అల్లు, మెగా ఫ్యామిలీస్ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని.. వారిమధ్య ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు మెగా అభిమానులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.