Nuvve Kavali: రీరిలీజ్ కాబోతున్న కల్ట్ క్లాసిక్ మూవీ.. మరోసారి థియేటర్లలోకి ‘నువ్వే కావాలి’..

ఇక ఇప్పుడు మరో కల్ట్ క్లాసిక్ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. అదే నువ్వే కావాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తరుణ్ నటించిన వన్ ఆఫ్ ది లవ్ స్టోరీ నువ్వే కావాలి. తరుణ్ నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నువ్వే కావాలి ఒకటి. డైరెక్టర్ విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ, మాటలు అందించారు.

Nuvve Kavali: రీరిలీజ్ కాబోతున్న కల్ట్ క్లాసిక్ మూవీ.. మరోసారి థియేటర్లలోకి 'నువ్వే కావాలి'..
Nuvve Kavali Movie Rereleas
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 30, 2023 | 8:53 AM

గత కొన్ని నెలలుగా చిత్రపరిశ్రమలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోస్ మూవీస్ మరోసారి అడియన్స్ ముందుకు వచ్చి సందడి చేస్తున్నాయి. ఒకప్పుడు ప్రేక్షకులను అలరించిన చిత్రాలనే ఇప్పుడు 4కే వెర్షన్ తో రిలీజ్ చేస్తుండగా.. ఇప్పుడు మరోసారి భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. గుడుంబా శంకర్, పోకిరి, బిల్లా, ఆరెంజ్ వంటి చిత్రాలకు కలెక్షన్స్ ఏ స్థాయిలో వచ్చాయో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు మరో కల్ట్ క్లాసిక్ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. అదే నువ్వే కావాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తరుణ్ నటించిన వన్ ఆఫ్ ది లవ్ స్టోరీ నువ్వే కావాలి. తరుణ్ నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నువ్వే కావాలి ఒకటి. డైరెక్టర్ విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ, మాటలు అందించారు.

ఇక ఈ సినిమాలో రిచా పల్లాడ్ కథానాయికగా నటించి మెప్పించింది. ఈ సినిమాను ఉషా కిరణ్ మూవీస్ పై రామోజీ రావు, స్రవంతి రవి కిషోర్ నిర్మించగా.. 2000లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ మూవీకి వచ్చిన క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి అందించిన మ్యూజిక్ ఎవర్ గ్రీన్ హిట్. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ శ్రోతలను ఆకట్టుకున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ సినిమాను 4కే వెర్షన్లో అడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నామంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే డేట్ ఎప్పుడనేది మాత్రం వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by @cinecric_adda

ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ రిచా పల్లాడ్ పలు చిత్రాల్లో నటించి అలరించింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చినప్పటికి తెలుగు సినీ పరిశ్రమలో అనుకున్నంతస్థాయిలో మాత్రం అవకాశాలు అందుకోలేకపోయింది. దీంతో ఆమె 2011లో హిమాన్షు బజాజ్ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. చాలా కాలం ఫ్యామిలీతో గడిపిన ఆమె.. 2016లో ఆది పనిశెట్టి నటించిన మలుపు సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు.

View this post on Instagram

A post shared by Shibu Khan (@shibu_shimmer)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నటి కూతుర్లు ఇద్దరూ డాక్టర్లే..
ఈ నటి కూతుర్లు ఇద్దరూ డాక్టర్లే..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!