Jailer movie: తలైవాకే కాదు.. డైరెక్టర్‏కు డబుల్ సర్ ప్రైజ్ ఇచ్చిన నిర్మాత.. ఖరీదైన లగ్జరీ కారుతోపాటు..

డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీకి రోజు రోజుకీ మరింత రెస్పాన్స్ వస్తుంది. కేవలం తమిళంలోనే కాదు.. తెలుగుతోపాటు, మలయాళం, కన్నడ, హిందీ ఇలా అన్ని చోట్ల అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ భారీగా కలెక్షన్స్ రాబట్టింది. అటు విదేశాల్లోనూ జైలర్ సత్తా చాటుతుంది. ఇక వీకెండ్స్ గురించి చెప్పక్కర్లేదు. చాలా కాలం తర్వాత తలైవా ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. వరల్డ్ వైడ్ గా రూ.625 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో ప్రొడ్యూసర్ కళానిధి మారన్ ఫుల్ సంతోషంలో ఉన్నారు.

Jailer movie: తలైవాకే కాదు.. డైరెక్టర్‏కు డబుల్ సర్ ప్రైజ్ ఇచ్చిన నిర్మాత.. ఖరీదైన లగ్జరీ కారుతోపాటు..
Director Nelson Dilip Kumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 02, 2023 | 6:45 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటేస్ట్ చిత్రం జైలర్. ఆగస్ట్ 10న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.625 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీకి రోజు రోజుకీ మరింత రెస్పాన్స్ వస్తుంది. కేవలం తమిళంలోనే కాదు.. తెలుగుతోపాటు, మలయాళం, కన్నడ, హిందీ ఇలా అన్ని చోట్ల అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ భారీగా కలెక్షన్స్ రాబట్టింది. అటు విదేశాల్లోనూ జైలర్ సత్తా చాటుతుంది. ఇక వీకెండ్స్ గురించి చెప్పక్కర్లేదు. చాలా కాలం తర్వాత తలైవా ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. వరల్డ్ వైడ్ గా రూ.625 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో ప్రొడ్యూసర్ కళానిధి మారన్ ఫుల్ సంతోషంలో ఉన్నారు. దీంతో తలైవా సినిమా లాభాల్లో వాటాతో పాటు.. ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు కళానిధి. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.

ఇక ఇప్పడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ వంతు వచ్చింది. జైలర్ సినిమా సెన్సెషన్ క్రియేట్ చేస్తుండగా.. డైరెక్టర్ దిలీప్ కుమార్ కు కోట్లు విలువ చేసే ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు కళానిధి. ఇందుకు సంబంధించిన చెక్ ను శుక్రవారం అందించారు. ఈ ఫోటోలను ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.

ఇప్పటికే తలైవాకు రూ. 100 కోట్ల చెక్ ఇవ్వడమే కాకుండా ఖరీదైన బీఎండబ్లూ కారును కూడా అందజేశారు. దీంతో జైలర్ సినిమాకు గానూ తలైవా రూ.210 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకున్న ఏకైక వ్యక్తిగా రజినీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు.

ఈ సినిమాలో రజినీతోపాటు.. కన్నడ సూపర్ స్టార్ శివకుమార్, మలయాళీ నటుడు మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్, సునీల్, యోగిబాబు, తమన్నా, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ హైలెట్ అని చెప్పాలి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్‏తో బాక్సాఫీస్ ను షేక్ చేశారు. ఇదిలా ఉంటే విడుదలైన మూడు వారాల్లోనే ఇండియాలో రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి 2023లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది జైలర్. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే