Krishna Mukunda Murari 2nd September: కృష్ణకు తాను మురారీ ప్రేమించుకున్న విషయం చెప్పడానికి ముకుంద రెడీ.. ప్రేమకు అడ్డొస్తే ఎవరిని వదలనని రేవతితో సవాల్..

కృష్ణ ముకుంద మురారీ సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ప్రేమించిన ప్రియురాలి పంతానికి,  భార్య ప్రేమకు మధ్య ఓ యువకుడి కథతో సాగుతున్న కృష్ణ ముకుంద మురారీ.. కుసుమ్ డోలా అనే సూపర్ హిట్ సీరియల్ ఆధారంగా తెలుగులో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా కృష్ణ, ముకుంద, మురారీ తెలుగు బుల్లి ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది.  శ్రావణ వరలక్ష్మి వ్రతానికి సిద్ధం అవుతున్న భవానీ ఫ్యామిలీ.. కృష్ణ వరలక్ష్మి వ్రత విశిష్టత గురించి చెప్పి.. అందరితోనూ వావ్ అనిపించుకుంటుంది. ముకుంద ఎలాగైనా వరలక్ష్మి వ్రతం కృష్ణ చేయకుండా చూడాలనుకుంటుంది.. ఈ రోజు సెప్టెంబర్ 2వ తేదీన ఏమి జరుగుతుందో చూద్దాం.. 

Krishna Mukunda Murari 2nd September: కృష్ణకు తాను మురారీ ప్రేమించుకున్న విషయం చెప్పడానికి ముకుంద రెడీ.. ప్రేమకు అడ్డొస్తే ఎవరిని వదలనని రేవతితో సవాల్..
Krishna Mukunda MurariImage Credit source: Hotstar
Follow us
Surya Kala

|

Updated on: Sep 06, 2023 | 9:32 AM

కృష్ణ వరలక్ష్మీవ్రత విశిష్ట గురించి ఫ్యామిలీ మొత్తానికి వివరిస్తుంది. వరలక్ష్మి వ్రతం చేస్తే భార్యాభర్తల మధ్య అన్నోన్యత ఉంటుందని.. ఆ కుటుంబం సిరి సంపదలతో ఉంటుందని.. శివుడు పార్వతికి చెప్పాడట అని అంటే.. రేవతి అబ్బో దీనికి మన సంప్రదాయాల మీద కూడా మంచి అవగాహన ఉంది అని రేవతి సంతోష పడుతుంది. భవానీ శభాష్ కృష్ణ బాగా చెప్పావు అని అంటూనే.. టెక్నాలజీ తో పాటు.. మన సంప్రదాయాలను, మన మూలాలను మరచిపోకూడదు అని అంటుంటే.. ఇలాంటి చేసి కృష్ణ అందరిని మాయ చేస్తుంది.. అయినా ఎంత సేపు నేను మా ప్రేమ అత్తయ్యకు తెలియాలి అనుకుంటున్నా కానీ.. అసలు తెలియాల్సింది ముందుగా కృష్ణకు.. కృష్ణకు మా ప్రేమ తెలిస్తే.. కృష్ణ మా ప్రేమని అర్ధం చేసుకుని నోరుమూసుకుంటుంది.. తమ ప్రేమని కృష్ణకు తన ప్రేమని చెప్పాలని అని ముకుంద ఆలోచిస్తుంది. రేపు పూజ సామాన్లు మనం ఇద్దరం కలిసి తెద్దాం అని ముకుంద అంటే.. ముకుంద ఏదో ప్లాన్ చేస్తుంది లేదు.. నేను ముకుంద ఆటలు సాగనివ్వను.. అని రేవతి అనుకుంటూ కృష్ణ ఎందుకులే ముకుందా .. నువ్వు నేను వెళ్దాం అని రేవతి అంటే.. ముకుంద షాక్ తింటుంది.. ఇంతలో భవానీ కల్పించుకుని లేదు రేవతి ముకుంద.. కృష్ణలే వెళ్తారు చెప్పాను కదా.. ఈ సారి వరలక్ష్మి వ్రతం  కొత్త జనరేషన్ ను ప్రోత్సహించాలని అంటుంటే.. ముకుంద కావాలనే ప్లాన్ తో కృష్ణ తో వెళ్తుంది. అని రేవతి అనుకుంటుంటే.. రేపు మా ప్రేమ విషయం కృష్ణ తో చెప్పకుండా ఎవరూ ఆపలేరు అని ముకుంద అని అనుకుంటుంది.

మురారీకి షాక్ ఇచ్చిన మధు..

మురారీ టెన్షన్ తో అటు ఇటు తిరుగుతుంటే.. కృష్ణ ను ముకుంద షాపింగ్ కు తీసుకుని వెళ్లి..  అక్కడికి ముకుంద మా ఒకప్పటి ప్రేమ విషయం చెబితే కృష్ణ రియాక్షన్ ఎలా ఉంటుంది.. తెలిసో తెలియకో ఒక్కప్పుడు ప్రేమించిన వాడిని మరచిపోమని కృష్ణ .. ముకుందకు సలహా కూడా ఇచ్చింది..  అంటే అది గతం గతః అని వదిలేస్తుందా.. ఇన్నాళ్లు ఈ విషయం చెప్పేలేదు మోసం చేశాను అనుకుంటుందా .. అప్పుడు అసలుకే ఎసరు వస్తుంది.. అసలు కృష్ణకు అమ్మ ఏమని చెప్పి తీసుకొచ్చింది అని పలు విధాలుగా ఆలోచిస్తూ ఉంటాడు మురారీ.. అసలు ఏమీ అర్ధం కావడం లేదు అని ఆలోచిస్తుంటే.. మధు బ్రో అంటూ వచ్చి చాలా దిగులుగా ఉన్నావు.. రెండు పెగ్గులు వేద్దాం.. దిగులు పోతుంది అని అంటే.. రా అని అన్న మధుని మురారీ కసురుతూ.. ఎంత సేపు తాగడం, రీల్స్ చేయడం ఇంతకు మించి నీ జీవితంలో ఏమీ లేదా అంటూ కసిరితే .. ఉంది బ్రో.. మన ఫ్యామిలీ అందరూ బాగుండాలి.. ముఖ్యంగా నువ్వు , కృష్ణ హ్యాపీగా ఉండాలి.. మీ జీవితం బాగుండాలి అని ఆలోచించాను కనుకనే.. ఆ రోజు కృష్ణకు ముకుంద నీ గదిలో చేసిన సెటప్ ముకుంద లవ్స్ మురారీ ని మార్చేసి వెలకమ్ కృష్ణ అని పెట్టాను బ్రో.. అని చెప్పి మధు.. మురారికి షాక్ ఇస్తాడు. అది మార్చింది నువ్వా బ్రో.. అని మురారీ అంటే .. ఏమిటి నామీద నమ్మకం లేదా అని అడుగుతాడు మధు.. ఛ ఛ అలాంటిది ఏమీ లేదు అని అంటాడు మురారీ. నువ్వు ఎప్పుడు ఎలా మార్చవని అని అడిగితే .. నేను అలా వెళ్తుంటే.. ముకుంద నీ గదిలో నుంచి బయటకు రావడం అది కూడా పెద్దమ్మ దగ్గరకు వెళ్లడం చూసాను.. అప్పుడు ముకుంద పెట్టినవి తీసేసి తాను వెలకమ్ కృష్ణ అని సెట్ చేసినట్లు మధు మురారికి చెబుతాడు. సూపర్ మధు థాంక్యూ సో మచ్ అంటూనే.. అసలు ముకుందతో నా లవ్ మేటర్ ఎలా తెలుసు.. ముకుంద నా గదిలోకి వెళ్తే.. అనుకున్నావు.. అని అంటే… మీ లవ్ మెటర్ నాకు ముకుంద చెప్పింది..  అంతేకాదు పెద్దమ్మకు కూడా తెలియాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది అని మధు మురారికి చెబుతాడు. నేను కావాలని ముకుందని మోసం చెయ్యలేదురా అంటే.. నాకు నీమీద నమ్మకం ఉంది.. మన ఇంట్లో ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ హ్యాపీగా ఉండాలని తీసుకుంటాం అని అంటే.. మధు.. మురారీలు ఒకరినొకరు హత్తుకుంటారు. మురారీ కృష్ణలను ఎవరూ విడదీయలేరు.. నువ్వు కృష్ణ అంతే బ్రో.. ఆదర్శ్ వస్తే.. ముకుంద సెట్ అవుతుంది అని అంటూ మధు వెళ్ళిపోతాడు.

ప్రాణ స్నేహితుడి భార్యవని ముకుందకు గుర్తు చేసిన మురారీ..

ఇవి కూడా చదవండి

నా వెనుక ఇన్ని కుట్రలు చేస్తున్నావు.. ఇంకా గతాన్ని తవ్వుకుంటూ అందులో కురుకుపోతున్నావు.. నా ప్రాణ స్నేహితుడి భార్యవని ఏమీ గట్టిగా చెప్పలేక పోతున్నా అని మురారీ అనుకుంటుంటే.. ముకుంద అక్కడికి వచ్చి మురారీ అని అంటుంది.. నూరేళ్లు ముకుంద గారు అని అంటే.. ప్లీజ్ నన్ను అలా పిలవడం మానేస్తావా అంటే.. మీరు నా ప్రాణ స్నేహితుడి భార్య అండి.. గౌరవించాలి అని అంటాడు మురారీ.. నీ గౌరవాన్ని , మర్యాదని పరాయిదైన కృష్ణ కు ఇవ్వు.. నాకు అవసరం లేదు.. నాకు నీ ప్రేమ మాత్రమే కావాలి అంటుంది ముకుంద. ఏమిటి ముకుంద గారు ఇలా వచ్చారు అని అంటే.. నేను కూడా డైరెక్ట్ గా పాయింట్ కు వచ్చేస్తున్నా.. రేపు కృష్ణని షాపింగ్ కు తీసుకుని వెళ్తున్నా.. రేపు కృష్ణకు మన ప్రేమ గురించి చెప్పేస్తా అని ముకుంద అంటే.. మురారీ నేను చెప్పనివ్వను కదా అంటాడు. ముకుంద గారు నేను మీతో వస్తాను లవ్ యూ మురారీ.. సూపర్ .. నువ్వు నాకు కావాలి.. నువ్వు కూడా ఉంటె.. ఇద్దరం కలిసే కృష్ణకు మన ప్రేమ విషయం చెప్పినట్లు ఉంటుంది. అంటే ఇన్ డైరెక్ట్ గా కృష్ణను సైడ్ అయిపోమన్నట్లు కదా.. సో ఇది ఫిక్స్ అయిపో అంటే.. నో నో అంటున్న మురారీతో ఏమైంది మురారీ ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అంటుంది ముకుంద. నువ్వు అలా పెడితే నేను చూడలేను.. నువ్వు వద్దంటే చెప్పు.. మనం ఇద్దరం ఒక అండర్ స్టాండింగ్ కు వద్దాం అని అంటే.. అది కాదు ముకుంద గారు మరి ఇంకేమిటి.. అంటే.. కృష్ణ రోజూ చాపమీద పడుకుంటుంది.. నేను అర్జెంట్ గా చాప దాచేయాలి అప్పుడే తాను బెడ్ మీద పడుకుంటుంది అని అంటాడు మురారీ.. ముకుంద వాట్ అంటుంటే సరే ముకుంద గారు మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు.

మధు.. అలేఖ్య సరదా సన్నివేశం

ఏమి రాస్తున్నావు అని అలేఖ్య మధుని అడిగితె.. కాన్సెప్ట్ అని అంటుంటే.. తింగరి పిల్ల వరలక్ష్మి వ్రతం.. పూజ షాపింగ్.. కాన్సెప్ట్ నెంబర్ 2 వరలక్ష్మి వ్రతం చేస్తున్న తింగరి పిల్ల.. అంటూ ఎలా ఉన్నాయి నా కాన్సెప్టులు అంటే.. అన్నీ కృష్ణకేనా.. నాకు ఏమీ లేవా అంటే.. చేస్తా కానీ ఇలా పూజలు వ్రతాలు కాదు.. రీల్స్ వర్కౌట్ కాదు.. భార్యాభర్తలు చేసే కామెడీ చేద్దాం అని అంటే.. నేను కామెనీ పీస్ నా అంటే చ నువ్వు కామెడీ చేస్తే కామెడీ కూడా చచ్చిపోతుంది అంటూనే అలేఖ్యని చూసి భయంతో మధు .. కామెడీ మరీ ఎక్కువ అయితే నవ్వు నవ్వి చచ్చిపోతాం అంటారు కదా.. కృష్ణ వీడియాలు చూస్తారా అంటూనే మధుని కొడుతోంది అలేఖ్య.

కృష్ణ ను తన దానిగా చేసుకునే ప్రయత్నంలో మురారీ..

మురారీ చాపని బీరువా మీద పెట్టి.. హ్యాపీగా జామురాతిరి జాబిలమ్మ పాట పాడుతుంటే.. కృష్ణ వచ్చి ఆ పాటని కృష్ణ కొనసాగిస్తుంది. ఈ రేయి తియ్యనిది అంటూ మురారీలు కృష్ణ పడుతూనే.. తన చాప కోసం కృష్ణ వెదుకుతుంది. బీరువా మీద ఉన్న చాపని చూసి.. ఈ చాపపై రెక్కలు ఎలా వచ్చాయి అంటుంటే.. ఈ దొంగ పని ఏసీపీ సార్ అని అంటుంటే.. చాప వాడము కదా అని .. చాప పనివాళ్లకు ఇచ్చిందేమో.. కింగ్ సైజ్ బెడ్ కదా ఇద్దరం పడుకోవడానికి ప్లేస్ ఉంటుంది కృష్ణ.. అంటుంటే.. చాపని బీరువా మీద చూపిస్తే..  చాప కళ్లు కదా కనిపించేసిందా అని మురారి అనుకుంటే.. అది తీసి ఇవ్వచ్చుగా అని కృష్ణ ఆలోచిస్తుంది. కృష్ణ హైట్ కు అది ఎలా అందదు కనుక చచ్చినట్లు బెడ్ మీద పడుకుంటుంది అని మురారీ ఆలోచిస్తాడు. కాసేపు కవరింగ్ ఇద్దమని.. కృష్ణ నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని బెడ్ మీద పడుకుంటాడు. అంటే మీరు తీసి ఇవ్వక పొతే.. బెడ్ మీద పడుకుంటానని అనుకుంటున్నారు. మీ నిద్ర ఎలా పాడుచేస్తానో చూడండి అంటూ స్టూల్ వేసుకుని బీరువా మీద ఉన్న చాపని తియ్యడానికి కృష్ణ ట్రై చేస్తుంది.. చాప తీయబోతు పడిపోబోతున్న కృష్ణను మురారీ పట్టుకుంటాడు.

బెడ్ మీద వచ్చి పడుకోవచ్చు కదా.. మరీ బెట్టు చేస్తుదని పిల్లా అని అనుకుంటుంటే.. ఇలా చాప దాచి మీ మనసులోనే మీ ప్రేమ దాచుకోవడం కాదు.. మీ ప్రేమని నాకు చెప్పినప్పుడు.. బెడ్ మీద కాదు.. మీ గుండెల మీదని తల పెట్టి ఎన్నో కబుర్లు చెబుతూ మిమ్మల్ని నిద్ర పుచ్చుతా ఏసీపీ సార్ అనుకుంటుంది కృష్ణ.

సోమవారం ఎపిసోడ్ లో..

నా ప్రేమకు అడ్డు పడితే.. కృష్ణను కాదు ఎవరినైనా ఎదిరిస్తా.. మీరు ఏమి చేస్తారో నేను చూస్తాను అని రేవతి తో ముకుంద సవాల్ విసురుతుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి