ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య.. బెడ్ రూంలో అనుమానాస్పద రీతిలో విగతజీవిగా..!
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ప్రముఖ మలయాళ సినీ, టీవీ నటి అపర్ణ నాయర్ (31) తిరువనంతపురంలోని తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. తిరువనంతపురంలోని కరమణలోని తన నివాసంలో గురువారం (ఆగస్టు 31) సాయంత్రం నటి అపర్ణ విగత జీవిగా కనిపించింది. స్థానిక మీడియా..
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ప్రముఖ మలయాళ సినీ, టీవీ నటి అపర్ణ నాయర్ (31) తిరువనంతపురంలోని తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. తిరువనంతపురంలోని కరమణలోని తన నివాసంలో గురువారం (ఆగస్టు 31) సాయంత్రం నటి అపర్ణ విగత జీవిగా కనిపించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. నటి ఆగస్టు 31 రాత్రి 7 గంటల 30 నిముషాల సమయంలో చనిపోయినట్లు సమాచారం.
సంఘటన జరిగిన సమయంలో మృతురాలి తల్లి, సోదరి ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. అపర్ణ తన బెడ్ రూంలో ఉరి వేసుకుని ఉన్నట్లు గమనించిన ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటీన కిల్లిపాలెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. దీనిపై నటి తల్లి, సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరమన పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకుని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అపర్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఓ పోలీస్ అధికారి తెలిపారు. అపర్ణ కుటుంబ సభ్యులు ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. పైగా సంఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించకపోవడంతో పోలీసులు అనుమానం మరింత బలపడుతోంది.
View this post on Instagram
ఇక అపర్ణ పి నాయర్ సినీ కెరీర్ గురించి చెప్పాలంటే.. ‘చందనమజ’, ‘ఆత్మసఖి’, ‘మైథిలీ వీందుం వరుమ్’, ‘దేవస్పర్శం’ వంటి టీవీ సీరియలలో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. టీవీ సీరియల్స్‌లో మాత్రమే కాకుండా ‘మేఘతీర్థం’, ‘ముత్తుగౌ’, ‘అచాయన్స్’, ‘కోదాటి సమక్షం బాలన్ వాకిల్’, ‘కల్కి’ వంటి పలు సినిమాల్లోనూ నటించింది. కాగా అపర్ణకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అపర్ణ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు.
View this post on Instagram
కెరీర్, కుటుంబానికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది. మృతి చెందడానికి 11 గంటల ముందు కూడా తన చిన్న కూతురుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. నటి అపర్ణ హఠన్మారణంపై అభిమానులు, తోటి నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.