Nayanthara: జవాన్ కోసం నయనతార అంత తీసుకుంటోందా.? నెంబర్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. ఇప్పటి వరకు విడుదలైన రెండు ట్రైలర్లు సినిమాకు మంచి పాజిటివ్ టాక్‌ను తీసుకొచ్చాయి. సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మూవీ కచ్చితంగా విజయాన్ని సాధిస్తుందన్న..
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ అడ్వెంచర్ మూవీ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తుండడం విజయ్ సేతుపతి, నయనతార వంటి నటీనటులు కూడా ఉండడంతో ఈ సినిమాపై అటు నార్త్‌తో పాటు ఇటు సౌత్‌లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు మేకర్స్. ఏ విషయంలోనూ రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. ఇప్పటి వరకు విడుదలైన రెండు ట్రైలర్లు సినిమాకు మంచి పాజిటివ్ టాక్‌ను తీసుకొచ్చాయి. సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మూవీ కచ్చితంగా విజయాన్ని సాధిస్తుందన్ననమ్మకంతో ఉన్నారు మేకర్స్. మేకింగ్ స్టైల్ మొదలు ట్రైలర్ వరకు అన్నీ దీనికి బలం చేకూర్చేలాగే ఉన్నాయి. దీంతో ఇండియన్ సినిమా మూవీ కూడా జవాన్ కోసం ఎదురు చూస్తోంది.
ఇదిలా ఉంటే ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వార్తనే నెట్టింట వైరల్ అవుతోంది. అదే ఈ సినిమాలో నటించిన రెమ్యునరేషన్. ఈ చిత్రంలో నయన ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. పెళ్లైన తర్వాత కూడా నయనతార క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. తాజా సమాచారం ప్రకారం జవాన్ చిత్రం కోసం నయన తార ఏకంగా రూ. 11 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తోంది. సౌత్‌లో ప్రస్తుతం ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్‌గా నయన తార అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
కెరీర్ తొలినాళ్ల నుంచి ఏమాత్రం తగ్గని క్రేజ్‌తో దూసుకుపోతున్న హీరోయిన్స్‌లో ఒకరిగా నయనతార అరుదైన గుర్తింపును పొందింది. 2003లో మలయాళం చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నయనతార ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతోంది. ఏడాది ఏడాదికి రెమ్యునరేషన్‌ను పెంచుకుంటూనే పోతోంది. ఇక జవాన్ సినిమాతో ఏకంగా రూ. 11 కోట్లకు చేరుకోవడం విశేషం. మరి జవాన్ చిత్రం నయనతార కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..