Egg yolk: గుడ్డులోని పచ్చసొన తినడం ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణుల సూచనలేమిటంటే?

బరువు తగ్గేవారు గుడ్డులోని తెల్లసొన మాత్రమే తింటారు.  అదే సమయంలో బరువు పెరగడానికి, పచ్చసొన తినడం మంచిది . కానీ గుడ్డులోని పచ్చసొన తినడం మనకు ఆరోగ్యకరమా లేదా అన్న అనుమానం కూడా చాలామందిలో ఉంది.

Egg yolk: గుడ్డులోని పచ్చసొన తినడం ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణుల సూచనలేమిటంటే?
EGG
Follow us

|

Updated on: Dec 17, 2022 | 9:31 PM

కాల్షియం, పొటాషియం వంటి మూలకాలతో కూడిన గుడ్లు మంచి ఆహారం. NCBI నివేదిక ప్రకారం, గుడ్డు ప్రోటీన్ పిల్లల ఎత్తును పెంచడానికి సహాయపడుతుంది. ఇది ఆహార కోరికలను అణిచివేస్తుంది. ఈ రోజుల్లో ప్రజలు అనేక రకాలుగా గుడ్లు తింటారు. బరువు తగ్గేవారు గుడ్డులోని తెల్లసొన మాత్రమే తింటారు.  అదే సమయంలో బరువు పెరగడానికి, పచ్చసొన తినడం మంచిది . కానీ గుడ్డులోని పచ్చసొన తినడం మనకు ఆరోగ్యకరమా లేదా అన్న అనుమానం కూడా చాలామందిలో ఉంది. ఈనేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన వైద్యురాలు ప్రియాంక షెరావత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో గుడ్డు పచ్చసొన గురించి పూర్తి సమాచారం ఇవ్వబడింది. గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన వేర్వేరుగా ఉన్నప్పటికీ, వాటి లక్షణాలు దాదాపు ఒకే విధంగా డాక్టర్‌ తెలిపారు. అలాగే కోడిగుడ్డులోని తెల్లసొన ఎంత ఆరోగ్యకరమో పచ్చసొన తింటే కూడా అంతే ఆరోగ్యకరమంటున్నారు. గుడ్డులో విటమిన్లు A, E, Kతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు ఒమేగా-3 సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

పచ్చసొన ఎలా తినాలంటే?

ఇక గుడ్డు పచ్చసొనలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే పోషకం. అంతేకాకుండా థైరాయిడ్ ఆరోగ్యంలో కూడా సెలీనియం సహాయపడుతుంది. శరీరంలో సెలీనియం లోపం వల్ల వికారం, వాంతులు, తలనొప్పి ప్రారంభమవుతాయి. ఒక గుడ్డులో 55 కేలరీలు, 2.5 గ్రాముల ప్రోటీన్, 4.5 గ్రాముల కొవ్వు అలాగే 0.61 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. గుడ్డు పచ్చసొనను ఉడకబెట్టుకొని తినడం ఉత్తమ మార్గం. అలాగే సగం ఫ్రై రకం డిష్ తినవచ్చు. జిమ్ లేదా వ్యాయామాలను అనుసరించే వారు పచ్చి గుడ్డును పాలలో కలిపి తాగడం ఎంతో మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌