Virat Kohli: కోహ్లీ భాయ్‌.. బాబర్‌ కన్నా నువ్వంటేనే మాకిష్టం.. విరాట్‌ పోస్టర్లతో పాక్‌ ఫ్యాన్స్ హంగామా

ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్‌ సందర్భంగా ఇద్దరు పాక్‌ అభిమానులు కోహ్లిపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. వచ్చే ఏడాది పాక్‌లో జరుగనున్న ఆసియా కప్‌లో ఆడాలని ప్లకార్డ్‌లు పట్టుకుని మరీ విజ్ఞప్తి చేశారు.

Virat Kohli: కోహ్లీ భాయ్‌.. బాబర్‌ కన్నా నువ్వంటేనే మాకిష్టం.. విరాట్‌ పోస్టర్లతో పాక్‌ ఫ్యాన్స్ హంగామా
Virat Kohli
Follow us
Basha Shek

|

Updated on: Dec 13, 2022 | 6:09 PM

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో కొన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ అతని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌లో ఏ మాత్రం తేడా రాలేదు. పైగా అభిమానం రెట్టింపయ్యింది కూడా. ఇక మన కింగ్‌కు దాయాది దేశమైన పాకిస్తాన్‌లోనూ భారీగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. పాక్‌ ఆడే మ్యాచ్‌ల్లోనూ కొందరు అభిమానులు కోహ్లీ ప్లకార్డులు, పోస్టర్లతో సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్‌ సందర్భంగా ఇద్దరు పాక్‌ అభిమానులు కోహ్లిపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. వచ్చే ఏడాది పాక్‌లో జరుగనున్న ఆసియా కప్‌లో ఆడాలని ప్లకార్డ్‌లు పట్టుకుని మరీ విజ్ఞప్తి చేశారు. ఓ అభిమాని అయితే.. తమ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ కంటే నిన్నే ఎక్కువ ఇష్టపడతామంటూ కోహ్లిపై అభిమానాన్ని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి

కాగా వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్‌కు పాక్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే భద్రతా పరమైన కారణాలతో ఈ టోర్నీలో పాల్గొనబోమని టీమిండియా ప్రకటించింది. దీంతో పాక్‌ క్రికెట్‌ బోర్డుతో పాటు పాక్‌ ప్రభుత్వం కూడా భారత్‌ క్రికెట్‌ జట్టుపై మండిపడుతున్నాయి. దీనికి సంబంధించి ఇరు దేశాల మాజీ క్రికెటర్ల మధ్య మాటల తూటాలు కూడా పేలుతున్నాయి. టీమిండియా ఆసియా కప్‌ ఆడకపోతే భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ టోర్నీని బహిష్కరిస్తామంటూ పీసీబీ చీఫ్ రమీజ్‌ రాజా చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..