- Telugu News Photo Gallery Cinema photos Kantara Hero Rishab Shetty poses with Bollywood stars wearing dhoti photos goes viral
Rishab Shetty: బాలీవుడ్ స్టార్స్‌తో కాంతారా హీరో.. పంచెకట్టులో అదరగొట్టాడుగా..
రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన కాంతారాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు రిషబ్. అతని క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది.
Updated on: Dec 12, 2022 | 8:57 PM

రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన కాంతారాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు రిషబ్. అతని క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్స్‌తో కలిసి సందడి చేశాడు రిషబ్. జాన్వీకపూర్, వరుణ్ ధావన్, అయుష్మాన్ ఖురానా, అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావ్, దుల్కర్ సల్మాన్, విద్యాబాలన్ ఈ ఈవెంట్‌లో సందడి చేశారు.

ఈ ఫొటోలను రిషబ్ శెట్టి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు 'అద్భుతమైన సాయంత్రం, అద్భుతమైన వ్యక్తులు. అద్భుతమైన చర్చ' అని దీనికి క్యాప్షన్ ఇచ్చాడు.

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాలీవుడ్ స్టార్స్ అందరూ సూటు, బూటుల్లో కనిపిస్తే కాంతారా హీరో మాత్రం సంప్రదాయ పంచెకట్టులో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.

కాగా ఈ ఫొటోలను చూసి రిషబ్ కూడా బాలీవుడ్‌లో నటిస్తాడా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.