Smriti Mandhana: టీ20 ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టిన స్మృతి మంధాన.. కెరీర్‌ బెస్ట్‌ రేటింగ్‌ పాయింట్లతో..

ఈ మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం అందుకున్న స్మృతి మొదటి మ్యాచ్‌లోనూ 22 బంతుల్లో 28 పరుగులు చేసింది. రెండు మ్యాచ్‌ల్లో కలిపి 100 కు పైగా పరుగులు సాధించిన ఈ టీమిండియా సెన్సేషన్‌ తాజాగా విడుదలైన ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది.

Smriti Mandhana: టీ20 ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టిన స్మృతి మంధాన.. కెరీర్‌ బెస్ట్‌ రేటింగ్‌ పాయింట్లతో..
Smriti Mandhana
Follow us
Basha Shek

|

Updated on: Dec 13, 2022 | 5:34 PM

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంలో స్మృతి మంధాన కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.188 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 49 బంతుల్లో 9 ఫోర్లతో 4 సిక్స్‌లతో 79 పరుగులు సాధించింది. ఆతర్వాత సూపర్‌ ఓవర్‌లోనూ 13 పరుగులు సాధించి భారత జట్టుకు గెలుపు బాట వేసింది. ఈ మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం అందుకున్న స్మృతి మొదటి మ్యాచ్‌లోనూ 22 బంతుల్లో 28 పరుగులు చేసింది. రెండు మ్యాచ్‌ల్లో కలిపి 100 కు పైగా పరుగులు సాధించిన ఈ టీమిండియా సెన్సేషన్‌ తాజాగా విడుదలైన ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది. కెరీర్‌ బెస్ట్‌ 741 పాయింట్లతో ర్యాంకింగ్స్‌లో ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. ఇక ఇదే సిరీస్‌లో అదరగొడుతున్న ఆస్ట్రేలియా బ్యాటర్‌ తహీలా మెక్‌గ్రాత్‌.. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. మొదటి మ్యాచ్‌లో 40 పరుగులు చేసిన మెక్‌గ్రాత్‌ రెండో మ్యాచ్‌లో 51 బంతుల్లోనే 70 రన్స్‌ సాధించింది. కాగా మెక్‌గ్రాత్‌ తన కెరీర్‌లో కేవలం 16 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడి నెం1 ర్యాంక్‌ను కైవసం చేసుకోవడం విశేషం.

టాప్‌-10లో ముగ్గురు..

ఇవి కూడా చదవండి

కాగా స్మృతితో సహా ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌ టాప్‌-10లో భారత నుంచి ముగ్గురు బ్యాటర్లు ఉన్నారు. ఆరో ర్యాంక్‌లో షెఫాలీ వర్మ, తొమ్మిదో ర్యాంక్‌లో రోడ్రిగ్స్‌ కొనసాగుతున్నారు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌, ఆస్ట్రేలియా జట్టు చెరొక విజయం సాధించాయి. సిరీస్‌లో కీలకమైన మూడో మ్యాచ్‌ బుధవారం (డిసెంబర్‌ 14) జరగనుంది. ముంబై వేదికగా సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..