AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: మొదటి టెస్ట్‌కు ముందు బంగ్లాకు భారీ షాక్‌.. అంబులెన్స్‌లో ఆస్పత్రికి షకీబ్‌.. కెప్టెన్‌కు ఏమైంది?

ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ గాయపడ్డాడు. ప్రాక్టీస్‌ చేస్తుండగా షకీబ్‌ తొడ కండరాలు పట్టేసినట్లు తెలుస్తోంది. అయితే స్టేడియం దగ్గరలో ఇతర వాహనాలేవీ అందుబాటులో లేకపోవడంతో అంబులెన్స్‌లో అతడిని ఆస్పత్రికి తరలించారు.

IND vs BAN: మొదటి టెస్ట్‌కు ముందు బంగ్లాకు భారీ షాక్‌.. అంబులెన్స్‌లో ఆస్పత్రికి షకీబ్‌.. కెప్టెన్‌కు ఏమైంది?
Shakib Al Hasan
Basha Shek
|

Updated on: Dec 13, 2022 | 4:59 PM

Share

భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ టెస్ట్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా తొలి టెస్టులో ఆడేలా కనిపించడం లేదు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ అతను మొదటి టెస్ట్‌లో బరిలోకి దిగడం అనుమానమే. ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ గాయపడ్డాడు. ప్రాక్టీస్‌ చేస్తుండగా షకీబ్‌ తొడ కండరాలు పట్టేసినట్లు తెలుస్తోంది. అయితే స్టేడియం దగ్గరలో ఇతర వాహనాలేవీ అందుబాటులో లేకపోవడంతో అంబులెన్స్‌లో అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి గాయం అంత తీవ్రమైనది కాదని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. దీంతో బంగ్లా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మొదటి టెస్టులో ఆడతాడా? లేదా? అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. మరోవైపు ఆసుపత్రి నుంచి స్టేడియానికి తిరిగి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొనలేదు. షకీబ్‌కు మ్యాచ్‌కు ముందు కాన్ఫరెన్స్ జరగాల్సి ఉంది కానీ దీనికి కూడా హాజరుకాలేదు. అతని స్థానంలో, జట్టు కోచ్, రస్సెల్ డొమింగో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో టీమిండియాతో జరిగే తొలి టెస్టులో షకీబ్ అల్ హసన్ ఆడడం అనుమానమే.

కాగా బంగ్లాదేశ్ కోచ్ రస్సెల్ డొమింగో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ షకీబ్ ఇప్పటికీ తన పక్కటెముకలు, భుజం సమస్యలతో పోరాడుతున్నాడు. అతను నెట్స్‌లో కొంత సమయం గడిపినప్పుడు, అతను మొదటి టెస్ట్ ఆడగలడా లేదా అనే దానిపై మేము నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్‌ సొంతం చేసుకోవడంలో షకీబ్‌ అల్‌ హసన్‌ కీలక పాత్ర పోషించాడు.

ఇవి కూడా చదవండి

టీమ్ ఇండియా:

కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు ఈశ్వా, అభిమన్యు ఈశ్వా ., సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.

బంగ్లాదేశ్ జట్టు:

మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హసన్ శాంటో, మోమినుల్ హక్, యాసిర్ అలీ చౌదరి, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిటెన్ దాస్, నూరుల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, సయ్యద్, ఖలీద్ అహ్మద్ ఇస్లాం, జాకీర్ హసన్, రెజౌర్ రెహమాన్ రాజా, అనముల్ హక్ బిజోయ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..