AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోన్ డయలర్‌లో ఈ గుర్తులు ఎందుకు ఉంటాయో తెలుసా..? 99శాతం మందికి తెలియని సీక్రెట్స్ ఇవే..

మనం ప్రతిరోజూ ఎంతో మందికి ఫోన్ కాల్స్ చేస్తుంటాం. డయలర్ ప్యాడ్ తెరవగానే 0 నుండి 9 అంకెలతో పాటు నక్షత్రం *, హ్యాష్ (#) గుర్తులు మనకు దర్శనమిస్తాయి. ఎవరికైనా కాల్ చేయాలంటే నంబర్లు ఉంటే సరిపోతుంది, మరి ఈ రెండు ప్రత్యేక గుర్తులు ఎందుకు ఉన్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ విషయాలు ఇప్పుడు

ఫోన్ డయలర్‌లో ఈ గుర్తులు ఎందుకు ఉంటాయో తెలుసా..? 99శాతం మందికి తెలియని సీక్రెట్స్ ఇవే..
Why Your Phone Keypad Has Star And Hash Symbols
Krishna S
|

Updated on: Mar 15, 2026 | 4:06 PM

Share

మనం ప్రతిరోజూ స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తుంటాం. డయలర్ ప్యాడ్ తెరిచిన ప్రతిసారీ 0 నుండి 9 అంకెలతో పాటు నక్షత్రం, హ్యాష్ గుర్తులు కనిపిస్తుంటాయి. ఎవరికైనా ఫోన్ చేయాలంటే కేవలం నంబర్లు సరిపోతాయి కదా, మరి ఈ రెండు బటన్లు ఎందుకు ఇచ్చారు? వీటి వల్ల ఉపయోగం ఏంటి? అనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. దీని వెనుక ఉన్న సాంకేతిక కారణాలు, ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండు గుర్తులు కేవలం అలంకారం కోసం కావు.. ఇవి శక్తివంతమైన డేటా ఎంట్రీ సాధనాలుగా పనిచేస్తాయి. సాధారణ నంబర్ల ద్వారా కాల్స్ చేస్తే, ఈ ప్రత్యేక గుర్తులను ఉపయోగించి టెలికాం నెట్‌వర్క్‌కు ప్రత్యేకమైన కమాండ్స్ పంపవచ్చు.

వీటి వల్ల కలిగే ఉపయోగాలు

యూఎస్‌ఎస్‌డీ (USSD) కోడ్‌లు: మీ మొబైల్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా, ఆఫర్ల గురించి తెలుసుకోవాలన్నా మనం *123# వంటి కోడ్‌లను వాడుతుంటాం. ఈ ప్రక్రియలో * ప్రారంభాన్ని, # ఎండింగ్‌ను సూచిస్తాయి.

నెట్‌వర్క్ సేవలు: కాల్ వెయిటింగ్, మిస్డ్ కాల్ అలర్ట్స్ వంటి సేవలను యాక్టివేట్ చేయడానికి లేదా డీయాక్టివేట్ చేయడానికి ఈ బటన్లు తప్పనిసరి.

ఐవీఆర్ సిస్టమ్: ఏదైనా కస్టమర్ కేర్‌కు కాల్ చేసినప్పుడు “భాషను ఎంచుకోవడానికి 1 నొక్కండి, ప్రతినిధితో మాట్లాడటానికి * నొక్కండి వంటి సూచనలను మనం వింటుంటాం. అక్కడ సిగ్నల్స్ పంపడానికి ఇవి కీలకం.

నంబర్ గోప్యత: కొన్ని దేశాల్లో కాల్ చేసేటప్పుడు మీ నంబర్ ఇతరులకు కనిపించకుండా ఉంచడానికి కూడా ప్రత్యేకమైన కోడ్స్‌లో వీటిని ఉపయోగిస్తారు.

ఇవి ఎలా పుట్టాయంటే..?

టెలిఫోన్ రంగంలో పుష్ బటన్ టెక్నాలజీ వచ్చినప్పుడు, కంప్యూటర్ సిస్టమ్‌లతో సులువుగా కమ్యూనికేట్ చేయడానికి ఈ రెండు గుర్తులకు చోటు కల్పించారు. అప్పట్లో ఇవి కేవలం ఇంజనీరింగ్ పనులకే పరిమితమైనా నేడు సామాన్య యూజర్లకు కూడా ఎన్నో సేవలను సులభతరం చేస్తున్నాయి.

Follow Us
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
90శాతం మందికి తెలియని వాషింగ్ మెషీన్ సీక్రెట్ ట్రిక్..
90శాతం మందికి తెలియని వాషింగ్ మెషీన్ సీక్రెట్ ట్రిక్..
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
ఎకరం వరి సాగుకు ఎంత పెట్టుబడి అవసరం? దేనికి ఎంత ఖర్చు అవుతుంది..?
ఎకరం వరి సాగుకు ఎంత పెట్టుబడి అవసరం? దేనికి ఎంత ఖర్చు అవుతుంది..?
27 ఏళ్ల వయసులోనే టాలీవుడ్ హీరోయిన్ హఠాన్మరణం.. కారణమేమిటంటే?
27 ఏళ్ల వయసులోనే టాలీవుడ్ హీరోయిన్ హఠాన్మరణం.. కారణమేమిటంటే?
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!