On This Day: భారత్‌లో పుట్టాడు.. 42 ఏళ్లకు ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.. ఎవరో తెలుసా?

దాదాపుగా 40 ఏళ్లు వచ్చాయంటే ఆటగాళ్లందరూ కూడా రిటైర్మెంట్ తీసుకోవడం ఖాయం. అయితే ఇక్కడొక ప్లేయర్‌కి మాత్రం 42 ఏళ్లకు..

On This Day: భారత్‌లో పుట్టాడు.. 42 ఏళ్లకు ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.. ఎవరో తెలుసా?
Colin
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 13, 2022 | 2:04 PM

దాదాపుగా 40 ఏళ్లు వచ్చాయంటే ఆటగాళ్లందరూ కూడా రిటైర్మెంట్ తీసుకోవడం ఖాయం. అయితే ఇక్కడొక ప్లేయర్‌కి మాత్రం 42 ఏళ్లకు జాతీయ జట్టులో చోటు దక్కింది. పుట్టింది భారత్‌లో.. ఆడిందేమో విదేశీ జట్టుకు.. అతడు మరెవరో కాదు.. కోలిన్ కౌడ్రీ. అది క్రిస్మస్ సమయం.. పండుగ కోసం కోలిన్ అన్నింటినీ సిద్దం చేస్తుండగా.. ఇంగ్లాండ్ సెలెక్టర్స్‌ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే ఆస్ట్రేలియాకు టికెట్ తీసుకున్నాడు. వాస్తవానికి ఆ సమయంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఇంగ్లీష్ జట్టుకు గాయాల బెడద ఎక్కువైంది. దీంతో ఇంగ్లాండ్ సెలెక్టర్ల నుంచి కోలిన్‌కు పిలుపు వచ్చింది. 42 సంవత్సరాల వయస్సులో కోలిన్.. డెన్నిస్ లిల్లీ, జెఫ్ థామ్సన్ వంటి ప్రమాదకరమైన బౌలర్లతో జత కలిశాడు. సరిగ్గా 48 ఏళ్ల క్రితం ఇదే రోజు అనగా డిసెంబర్ 13, 1974 సంవత్సరంలో కోలిన్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఆ సమయంలో దాదాపు 3 సంవత్సరాల తర్వాత బరిలోకి దిగిన కోలిన్.. టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 22 పరుగులు.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది. అప్పటి నుంచి కోలిన్ 1975 వరకు ఇంగ్లాండ్ తరపున 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. కాగా, 1954లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కోలిన్ తన కెరీర్‌లో 114 టెస్టు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించి 7,624 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతడు 22 సెంచరీలు, 38 ఫిఫ్టీలు కొట్టాడు. 1971లో ఇంగ్లండ్ తరఫున అతడు కేవలం ఒకే ఒక్క వన్డే ఆడగలిగాడు. మరోవైపు కోలిన్ 1932 డిసెంబర్ 24న తమిళనాడులో జన్మించాడు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!