Telugu News Trending Optical Illusion: Can You find a woodpecker in this viral picture Telugu Trending News
Optical Illusion: ఈ చెట్టు కొమ్మన ఒక పిట్టుంది.. 15 సెకన్లలో కనిపెడితే తోపే.. 99 శాతం ఫెయిల్.. మరి మీరు?
తాజాగా అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోన్న ఈ ఫొటోలో ఒక చెట్టు మాత్రమే మనకు కనిపిస్తుంది. అయితే ఆ చెట్టు కొమ్మన ఒక వడ్రంగి పిట్ట కూడా కూర్చుంది. కానీ తదేకంగా చూస్తే కానీ అది మనకు కనిపించదు.
ఆప్టికల్ ఇల్యూషన్ అంటే కళ్లను మోసం చేసే చిత్రం. ఈరోజుల్లో అలాంటి ఫొటోలకు సోషల్ మీడియాలో బాగా క్రేజ్ ఉంది. మన మెదడు పనితీరుకే కాదు మన ఓపిక, సహనానికి ఇవి పరీక్షపెడతాయి. ఇలాంటి ఫొటో ఫజిల్స్‌కు నెట్టింట బాగానే ఆదరణ ఉంటోంది. చూడడానికి సింపుల్‌గానే ఉన్నా మనకు తెలియని మర్మం ఇందులో ఉంటుంది. మన మైండ్ ఎంత షార్ప్ అనేది ఈ పజిల్స్ వల్ల ఇట్టే తెలిసిపోతుంది. అందుకే చాలా మంది ఇలాంటి ఛాలెంజ్ లను సాల్వ్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోన్న ఈ ఫొటోలో ఒక చెట్టు మాత్రమే మనకు కనిపిస్తుంది. అయితే ఆ చెట్టు కొమ్మన ఒక వడ్రంగి పిట్ట కూడా కూర్చుంది. కానీ తదేకంగా చూస్తే కానీ అది మనకు కనిపించదు. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే 15 సెకన్లలోపు ఆ చెట్టుకొమ్మన పిట్టను కనుగొనాలి. అలా కనుక్కుంటే మీవి డేగకళ్లని, మీ దృష్టి బాగుందని అర్ధం. మరి మీరు ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్‌ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా?
ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి బాలమురుగన్ పి ఈ చిత్రాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఇది ఇందిరా గాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో తీసిన ఫొటో. దీనిని ఆప్టికల్ ఇల్యూషన్‌కు సరైన ఉదాహరణ అని అనవచ్చు. ఎందుకంటే ఈ చిత్రాన్ని చూసిన చాలామందికి చెట్టు మాత్రమే కనిపిస్తుంది. పిట్ట ఉన్నది మాత్రం అసలు కనుక్కోలేరు. ఎందుకంటే వడ్రంగి పిట్ట కూడా చెట్టు కలర్‌లోనే ఉంటుంది. కాబట్టి 99 శాతం మంది ఈ ఫజిల్‌ను సాల్వ్ చేయలేక చతికిల పడ్డారు.
లక్షల ప్రయత్నాలు చేసినా పక్షి దొరకలేదని ట్విట్టర్ యూజర్ల రియాక్షన్‌లను బట్టి తెలుస్తోంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఎంత ప్రయత్నించినా పిట్టను కనుక్కోలేకపోతే కింద వైట్ సర్కిల్‌లో చూడవచ్చు.