- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: List of Uncapped players who can be big buys in IPL 2023 mini auction
IPL 2023: ఈ అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు మినీ వేలంలో కనక వర్షమే.. కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమైన ఫ్రాంఛైజీలు
IPL 2023 మినీ వేలానికి మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొత్తం 10 ఫ్రాంచైజీలు తమకు కావలసిన ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇక మినీ వేలం కోసం పలువురు ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని ఎంతో యంగ్ అండ్ ట్యాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. దేశవాళీ క్రికెట్‌లో అమోఘంగా రాణిస్తున్న వీరిపై మినీ వేలంలో కనక వర్షం కురిసే అవకాశం ఉంది. అలాంటి కొంతమంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఎవరో చూద్దాం రండి.
Updated on: Dec 11, 2022 | 7:59 PM

IPL 2023 వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ నారాయణ జగదీషన్‌ను జట్టు నుండి విడుదల చేసింది. అయితే, ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో జగదీసన్ వరుస సెంచరీలు చేశాడు. అందుకే ఈసారి జగదీశన్ ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది ఈ ఆటగాడిని చెన్నై అసలు ధర 20 లక్షలకు కొనుగోలు చేసింది.

కోట్ల వర్షం కురిపించే అన్‌క్యాప్డ్ ఆటగాళ్లలో ముంబైకి చెందిన షామ్స్ ములానీ కూడా ఉన్నాడు. రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు (45) తీసిన ములానీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ 10 వికెట్లు పడగొట్టాడు.

ఈ వేలంలో కర్నాటకకు చెందిన రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ విద్వాత్ కవీరప్ప అత్యధిక మొత్తాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. మహారాజా టీ20 ట్రోఫీలో గుల్బర్గా మిస్టిక్స్ తరఫున ఆడిన కావీరప్ప 13 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. దీని తర్వాత, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 6.36 ఎకానమీ రేట్‌తో కవీరప్ప ఎనిమిది మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. చాలా జట్లకు ఫాస్ట్ బౌలర్ అవసరం, కాబట్టి కావేరప్ప భారీ మొత్తాన్ని పొందే అవకాశం ఉంది.

దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న సమర్థ్ వ్యాస్‌పై చాలా జట్లు కన్నేశాయి. విజయ్ హజారే ట్రోఫీలో 10 మ్యాచ్‌లు ఆడిన వ్యాస్ 443 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీ కూడా ఉంది. అలాగే, విజయ్ హజారే ట్రోఫీలోనూ భారీగా పరుగులు సాధించాడు.

అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టాడు రవికుమార్. మొత్తం 6 మ్యాచ్‌ల్లో 10 వికెట్లతో మెరిశాడు. దీని తర్వాత, రవి బెంగాల్ తరపున సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో అరంగేట్రం చేసాడ. ఆడిన మూడు మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు పడగొట్టాడు. కాబట్టి ఐపీఎల్ మినీ వేలంలో ఈక్రికెటర్‌ను దక్కించుకోవడానికి ఫ్రాంఛైజీలు పోటీపడవచ్చు.