- Telugu News Photo Gallery Cricket photos Mayank agarwal and his wife aashita sood are blessed with a baby boy phot viral
Mayank Agarwal: పుత్రోత్సాహంతో మురిపిపోతోన్న టీమిండియా ఓపెనర్.. శుభాకాంక్షలు తెలిపిన క్రికెటర్లు..
క్రికెటర్ మయాంక్ అగర్వాల్ 2018లో అష్టా సూద్‌ను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత మయాంక్ అగర్వాల్ తండ్రి అయ్యాడు.
Updated on: Dec 11, 2022 | 11:52 AM

భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ ఈ రోజుల్లో టీమ్ ఇండియాకు దూరంగా ఉండవచ్చు. కానీ, అతని జీవితంలో ఆనందం రెట్టింపు అయింది. మయాంక్ అగర్వాల్ ఆదివారం తన జీవితంలో అతిపెద్ద శుభవార్త గురించి అభిమానులకు తెలియజేశాడు.

మయాంక్ అగర్వాల్ జీవితంలో కొత్త ఇన్నింగ్స్ మొదలైంది. అతను తండ్రి అయ్యాడు. ఆయన భార్య అష్టా సూద్ డిసెంబర్ 8న ఒక కొడుకుకు జన్మనిచ్చింది. మయాంక్ అగర్వాల్ ఆదివారం తన భార్య, కొడుకుతో ఉన్న చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

'మా హృదయం చాలా సంతోషంగా ఉంది. మేం మీకు అయాన్ష్‌ని పరిచయం చేయాలనుకుంటున్నాం' అంటూ రాసుకొచ్చారు. చిత్రంలో చిన్నారి ముఖం స్పష్టంగా కనిపించలేదు.

మయాంక్ అగర్వాల్‌కి తోటి ఆటగాళ్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పోస్ట్‌పై విరాట్ కోహ్లీ వ్యాఖ్యానిస్తూ, 'మీ ఇద్దరికీ అభినందనలు' అని కామెంట్ చేశాడు. ఇది కాకుండా, జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేషన్, అజింక్యా రహానే, అతని భార్య కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

మయాంక్ అగర్వాల్ నాలుగేళ్ల క్రితం అష్టా సూద్‌ను వివాహం చేసుకున్నారు. 2018లో జరిగిన ఈ జంట వివాహానికి పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. ఆ తర్వాత మయాంక్ అదృష్టం కలిసివచ్చింది. టీమిండియా పిలుపు వచ్చింది. ప్రస్తుతం అతను జట్టుకు దూరంగా ఉన్నాడు. తొమ్మిది నెలలుగా ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు.




