ఆస్ట్రేలియా అహంకారాన్ని భారత మహిళల జట్టు దెబ్బతీసింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా అజేయ ప్రయాణానికి భారత్ బ్రేక్ వేసింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా వరుసగా 16 టీ20 మ్యాచ్‌లు గెలిచింది. అయితే 17వ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఓడించి భారత జట్టు ఆసీస్ ప్రయాణానికి అడ్డుకట్ట వేసింది. ఆస్ట్రేలియాపై ఈ భారీ విజయంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఆమె పక్కన నిలవలేకపోయారు.