Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

kirrak RP: కూకట్‌పల్లిలో కర్రీ పాయింట్‌ స్టార్ట్‌ చేసిన బుల్లితెర కమెడియన్‌.. ఈ వంటకాలు స్పెషల్

త్వరలోనే పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమవుతోన్న కిర్రాక్ ఆర్పీ తాజాగా కర్రీ పాయింట్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. ఇందులో భాగంగానే కూకట్‌పల్లిలో 'నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు' పేరిట కర్రీ పాయింట్‌ను ప్రారంభించాడు.

kirrak RP: కూకట్‌పల్లిలో కర్రీ పాయింట్‌ స్టార్ట్‌ చేసిన బుల్లితెర కమెడియన్‌.. ఈ వంటకాలు స్పెషల్
Kiraak Rp
Basha Shek
|

Updated on: Dec 11, 2022 | 10:26 PM

Share

జబర్దస్త్‌ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో కిరాక్‌ ఆర్పీ కూడా ఒకరు. బుల్లితెర కామెడీషోలో కొన్ని వందల స్కిట్లలో నటించి అలరించిన అతను టీమ్‌ లీడర్‌గానూ ఆకట్టుకున్నాడు. తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత నాగబాబుతో పాటు జబర్దస్త్‌ను వదిలేసి అదిరింది షోకు వెళ్లాడు. అయితే ఆ మధ్యన కొన్ని కాంట్రవర్సీ కామెంట్లతో వార్తల్లో నిలిచాడు. ఇటీవల తాను ప్రేమించిన అమ్మాయితో గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. త్వరలోనే పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమవుతోన్న కిర్రాక్ ఆర్పీ తాజాగా కర్రీ పాయింట్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. ఇందులో భాగంగానే కూకట్‌పల్లిలో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరిట కర్రీ పాయింట్‌ను ప్రారంభించాడు. పూజా కార్యక్రమాలతో శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కర్రీ పాయింట్‌ స్పెషల్‌ ఏమిటంటే.. చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, కొరమీను పులుసు, సన్నచేపల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు.. ఇలా అన్నీ కట్టెలపొయ్యి మీదనే వండుతారట. వ్యాపారంలో లాభాలు కలిసొస్తే మరో 15 బ్రాంచులు ఓపెన్‌ చేస్తానంటూన్నాడీ స్టార్‌ కమెడియన్‌

నెల్లూరు వంటకాలు స్పెషల్..

కిరాక్‌ ఆర్పీ స్వస్థలం నెల్లూరు. అక్కడ ఎంతో ఫేమస్‌ అయిన చేపల పులుసు అంటే తనకెంతో ఇష్టమట. అందుకే ఇష్టపడి మరీ చేపల పులుసు తయారుచేయడం నేర్చుకున్నాడట. అతను చేసే ఈ వంటకాన్ని అతని మిత్రులు లొట్టలేసుకుని మరీ తినేవారట. అలాంటి నెల్లూరు చేపల పులుసును హైదరాబాద్‌ నగరవాసులకు అందజేయాలనే ఉద్దేశంతో కూకట్‌పల్లిలో కర్రీ పాయింట్‌ను ప్రారంభించాడట. కాగా పదేళ్ల క్రితమే దీన్ని ప్రారంభించాలనుకున్న ఆర్పీ ఎట్టకేలకు తాజాగా తన కలను నెరవేర్చుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..