- Telugu News Photo Gallery Cinema photos Nani's Pilla Zamindar Fame Haripriya and KGF villain Vasishta Simha gets engaged
Haripriya: కేజీఎఫ్ విలన్‌తో పెళ్లిపీటలెక్కనున్న పిల్ల జమీందార్ హీరోయిన్.. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్
నాని పిల్ల జమీందార్ తో పాటు తకిట తకిట, బాలయ్యతో జై సింహ, వరుణ్ సందేశ్‌తో అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాటా తదితర తెలుగు సినిమాల్లోనూ హరిప్రియ సందడి చేసింది.
Updated on: Dec 10, 2022 | 6:04 PM

తెలుగులో నటించింది కొన్ని సినిమాల్లోనైనా మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ హరిప్రియ. ముఖ్యంగా నాని సరసన పిల్ల జమిందార్ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

అలాగే తకిట తకిట, బాలయ్యతో జై సింహ, వరుణ్ సందేశ్‌తో అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాటా తదితర తెలుగు సినిమాల్లోనూ హరిప్రియ సందడి చేసింది.

ఇక కన్నడ ఇండస్ట్రీలో రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, శ్రీమురళి వంటి స్టార్ హీరోల సరసన నటించింది. తన అందం, అభినయానికి గుర్తింపుగా పలు అవార్డులు కూడా గెల్చుకుంది.

సినిమాలతో బిజీగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. కేజీఎఫ్ సిరీస్‌లో విలన్‌గా ఆకట్టుకున్న వశిష్ట సింహాతో ఆమె నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది.

'మేమిద్దరం ఒక్కటి కాబోతున్నాం. మా నిశ్చితార్థం వేడుకగా జరిగింది. మీ దీవెనలు కావాలి' అని తన ఎంగేజ్‌మెంట్ ఫొటోలను షేర్ చేసింది హరిప్రియ. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

కన్నడ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, నెటిజన్లు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

వశిష్ట సింహా విషయానికొస్తే.. కేజీఎఫ్ సిరీస్‌లతో పాటు నారప్ప, నయీం డైరీస్, ఓదెల రైల్వేస్టేషన్ తదితర తెలుగు సినిమాల్లో నూ నటించాడు.




