- Telugu News Photo Gallery Cinema photos Surya Web Series Actress Mounika Reddy Getting Marriage Her Friend Sandeep telugu cinema news
పెళ్లి చేసుకోబోతున్న సూర్య వెబ్ సిరీస్ హీరోయిన్ మౌనిక.. వరుడు ఎవరంటే..
యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో నటించిన సూర్య వెబ్ సిరీస్ ఎంత హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. సాఫ్ట్ వేర్ డెవలపర్ తర్వాత షన్నూ నటించిన ఈ సిరీస్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో మౌనిక రెడ్డి కథానాయికగా కనిపించింది.
Updated on: Dec 10, 2022 | 5:26 PM

యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో నటించిన సూర్య వెబ్ సిరీస్ ఎంత హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. సాఫ్ట్ వేర్ డెవలపర్ తర్వాత షన్నూ నటించిన ఈ సిరీస్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో మౌనిక రెడ్డి కథానాయికగా కనిపించింది.

ఈ సిరీస్ తో రాత్రికి రాత్రే స్టార్ డమ్ తెచ్చుకుంది మౌనిక. అదే క్రేజ్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీలో లేడీ కానిస్టేబుల్ పాత్రలో కనిపించింది.

ఇక ఇటీవల వచ్చిన ఓరి దేవుడా సినిమాలోనూ నటించింది. అటు వెండితెరపైనే కాకుండా.. ఇటు షార్ట్ ఫిలింస్ , వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది మౌనిక. తాజాగా బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది.

ఈ విషయాన్ని మౌనిక స్వయంగా తన ఇన్ స్టా ద్వారా తెలియజేసింది. తన ప్రియుడు సందీప్‌తో ఏడడుగులు వేయనుంది. అంతేకాదు.. తన పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేసింది.

డిసెంబర్ 17, 18 తేదీల్లో గోవాలో డెస్టినే షన్ వెడ్డింగ్ జరగనున్నట్లు తెలిపింది. కాగా వీరిద్దరు మొదట స్నేహితులుగా పరిచయమయ్యారు.

కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్న వీరు.. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. దీంతో మౌనికకు తన సహా నటీనటుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

పెళ్లి చేసుకోబోతున్న సూర్య వెబ్ సిరీస్ హీరోయిన్ మౌనిక.. వరుడు ఎవరంటే..