Guess The Actress: లోకల్‌ ట్రైన్‌లో జర్నీ చేసి సింప్లిసిటీని చాటుకున్న స్టార్‌ హీరోయిన్‌.. మీరైనా గుర్తుపట్టారా?

తాజాగా బాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్‌ హీరోయిన్‌ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ముంబై లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణించింది. అయితే ఫేస్‌కు మాస్క్‌ పెట్టుకుని రావడంతో చాలామంది ఆమెను గుర్తుపట్టలేదు.

Guess The Actress: లోకల్‌ ట్రైన్‌లో జర్నీ చేసి సింప్లిసిటీని చాటుకున్న స్టార్‌ హీరోయిన్‌.. మీరైనా గుర్తుపట్టారా?
Guess The Actress
Follow us
Basha Shek

|

Updated on: Dec 10, 2022 | 8:46 PM

సాధారణంగా సినిమా తారలు ఎక్కువగా సొంత లగ్జరీ వాహనాల్లోనే ఎక్కువగా జర్నీ చేస్తుంటారు. బస్సులు, రైళ్లు, ఆటోలు వంటి ప్రజారవాణా సౌకర్యాలను వినియోగించడం అరుదుగా చూస్తుంటాం. ఎందుకంటే సినిమా సెలబ్రిటీలు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో ప్రయాణిస్తే భద్రతా పరంగా కొన్ని సమస్యలు కూడా ఎదురుకావచ్చు. ఇక అభిమానుల తాకిడిని అసలు తట్టుకోలేరు. సెల్ఫీలు, ఫొటోలు అంటూ ఎగబడుతుంటారు. ఫలితంగా వారితో పాటు పక్కనున్న వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతుంటుంది. అయితే కొందరు స్టార్‌ హీరోలు, హీరోయిన్లు అప్పుడప్పుడు ప్రజా రవాణాల్లో జర్నీ చేసి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్‌ హీరోయిన్‌ కూడా అలాగే చేసింది. అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ముంబై లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణించింది. అయితే ఫేస్‌కు మాస్క్‌ పెట్టుకుని రావడంతో చాలామంది ఆమెను గుర్తుపట్టలేదు. అయితే కొందరు ఆమెను గుర్తుపట్టడంతో అసలు విషయం తెలిసింది. మరి ఇంతకీ ఈ సొగసరి ఎవరో మీరు గుర్తుపట్టారా?

ఈమె మరెవరో కాదు బాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్‌ సారా అలీఖాన్‌. ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించడంతో పాటు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో తన టీంతో కలిసి ఇలా లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణం చేసింది. ట్రైన్‌ దిగిన అనంతరం కూడా సారా ఆటోలో ప్రయాణం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సారానే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. స్టార్‌ సెలబ్రిటీ స్టేటస్‌ ఉన్నా ఇలా లోకల్‌ ట్రైన్‌ లో జర్నీ చేయడం సారా సింప్లిసిటీకి నిదర్శనమని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సైఫ్‌ వారసురాలిగా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన సారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. కేదార్‌ నాథ్‌, సింబా, లవ్‌ ఆజ్‌కల్‌, కూలీ నంబర్‌ వన్‌, అత్రంగీ రే సినిమాల్లో నటించి ఇప్పటికే క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం గ్యాస్‌ లైట్‌తో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటోందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే